Site icon NTV Telugu

ED Raids: కాంగ్రెస్ మాజీ మంత్రి ఇంట్లో ఈడీ దాడులు.. 3 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో సోదాలు

Ed

Ed

ఇవాళ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) అధికారులు సోదాలు చేస్తుంది. ఉత్తరాఖండ్ తోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మొత్తం పది చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫారెస్ట్ స్కామ్‌తో సంబంధాలు ఉన్న మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈ రైడ్స్ జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read Also: High Temperatures: మెుదటి వారంలోనే భానుడి భగభగలు.. ఫిబ్రవరిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

అయితే, ఢిల్లీ, డెహ్రాడూన్‌తో పాటు చండీఘ‌డ్‌లోనూ ఈడీ అధికారులు త‌నిఖీలు చేస్తున్నారు. జిమ్ కార్బెట్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీలు చేస్తోంది. 2022 ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరక్ సింగ్ రావత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా బీజేపీ అతడ్ని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసింది. దీంతో పాటు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇక, కార్బెట్ టైగ‌ర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో 2021లో జ‌రిగిన నిర్మాణాల విష‌యంలో అక్రమాలు జరిగినట్లు అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో హరక్ సింగ్ రావత్ అటవీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ అవినీతి జరిగింది ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసులో డీఎఫ్ఓ కిషన్ చాంద్ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Exit mobile version