Site icon NTV Telugu

ED Raids: మెడికల్ కాలేజీ అనుమతుల కోసం లంచాలు.. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఈడీ రైడ్స్..

Ed Raids

Ed Raids

ED Raids: దేశవ్యాప్తంగా మరో పెద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాలల అనుమతుల వ్యవహారంలో లంచాలు, గోప్య సమాచారం లీక్ కేసులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ (NCT) సహా పది రాష్ట్రాల్లో మొత్తం 15 ప్రాంతాల్లో ఒకేసారి ఈడీ దాడులు నిర్వహిస్తోంది. ఈ సోదాలు సీబీఐ నమోదు చేసిన FIR No. RC2182025A0014 (తేది 30-06-2025) ఆధారంగా జరుగుతున్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు.

READ MORE: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు

సీబీఐ ఎఫ్‌ఐఆర్ వివరాల ప్రకారం.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అధికారులకు లంచాలు ఇచ్చి, మెడికల్ కాలేజీల తనిఖీలకు సంబంధించిన గోప్య సమాచారం పొందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా కొంతమంది మెడికల్ కాలేజీల కీలక నిర్వాహకులు, మధ్యవర్తులు తనిఖీల పారామీటర్లను తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకుని, అకాడెమిక్ కోర్సులకు అనుమతులు పొందినట్లు విచారణలో బయటపడినట్లు పేర్కొన్నారు. ఈడీ సోదాల్లో భాగంగా ఏడు మెడికల్ కాలేజీల ప్రాంగణాలు, అలాగే ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేరొచ్చిన కొంతమంది వ్యక్తుల నివాసాలు, కార్యాలయాలు కూడా శోధనలకు గురవుతున్నాయి. ఈడీ అధికారులు సంబంధిత ప్రాంతాల నుంచి ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ డాటా, కమ్యూనికేషన్ రికార్డులు, ఇతర కీలక సాక్ష్యాలను సీజ్ చేసినట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న లంచాల లావాదేవీలు, నిధుల మార్గం, మనీలాండరింగ్ కోణంలో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని విచారణ సంస్థలు సూచిస్తున్నాయి.

READ MORE: Snake Bite: పాము కాటు వేసిందా?.. కంగారు పడకుండా ఈ సూచనలు పాటిస్తే సరి!

Exit mobile version