Site icon NTV Telugu

Chikoti Praveen : క్యాసినో కేసులో ఇవాళ ఈడీ విచారణకు ‘చికోటి’

Chikoti Praveen

Chikoti Praveen

Chikoti Praveen : క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ నేడు ఈడీ ఎదుట హాజరయ్యాడు. క్యాసినో కేసులో ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని.. చికోటి ప్రవీణ్‌పై గతంలో ఈడీ కేసు నమోదు చేసింది. తాజాగా.. థాయిలాండ్‌ ఘటన నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇచ్చింది. చికోటిపై విదేశాల్లో నిర్వహించిన క్యాసినో ఈవెంట్స్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలున్నాయి. దీంతో ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో హాజరయ్యాడు. చికోటి ప్రవీణ్‌ థాయిలాండ్‌లో క్యాసినో నిర్వహిస్తుండటంతో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సందర్భంగా పెద్ద ఎత్తున నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి చికోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించనుంది.

Read Also:Tiger Nageswara Rao: ముహూర్తం ఫిక్స్ అయ్యింది తమ్ముళ్లు… వేటకి సిద్ధమా?

చికోటి ప్రవీణ్‌తో పాటు చిట్టి దేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌లకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో వారు కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకానున్నారు. గతంలో క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్‌కు సంబంధించి చికోటి ప్రవీణ్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు మరోసారి ప్రశ్నించడం కీలకంగా మారింది. వారం క్రితం చికోటి థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు. అయితే నాలుగు రోజులు ఫోకర్ టోర్నమెంట్ ఉంటుందని, ఆ టోర్నమెంట్ లీగల్ అని చెప్పడంతో తాను థాయ్‌లాండ్ వెళ్లినట్లు చికోటి చెబుతున్నాడు. లీగల్ అని తనకు లేఖ కూడా పంపారని, అందులో స్టాంప్‌లు కూడా పంపారని చికోటి ప్రవీణ్ చెబుతున్నాడు. థాయిలాండ్‌లో ఫోకర్ ఇల్లీగలని తనకు తెలియదని అంటున్నాడు. థాయ్‌లాండ్‌లో తాను క్యాసినో నిర్వహించలేదని, ఒక ప్లేయర్‌లా ఈవెంట్‌కి వెళ్లానన్నాడు.

Read Also:Dharmana Prasada Rao: రాష్ట్రంలో కుట్ర జరుగుతోంది.. ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Exit mobile version