NTV Telugu Site icon

ED Raids: షెల్ కంపెనీపై ఈడీ దాడులు.. భారీగా నగదు స్వాధీనం

Ed Raids

Ed Raids

ED Raids: ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఓ కీలక చర్య చేపట్టింది. ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ లోని 15 వేర్వేరు ప్రదేశాలలో డిపార్ట్మెంట్ దాడులు చేసింది. షెల్ కంపెనీపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) భారీ చర్యలు తీసుకుంది. గతంలోని క్వాలిటీ లిమిటెడ్ కంపెనీకి చెందిన అప్పటి డైరెక్టర్‌కు చెందిన 15 స్థానాలపై ఈడీ దాడులు చేసి రూ. 1.3 కోట్ల విలువైన నగదును, అనేక నేరారోపణ పత్రాలను స్వాధీనం చేసుకుంది. అలాగే డీమ్యాట్ ఖాతాలో ఉన్న రూ.2.5 కోట్లను సీజ్ చేశారు అధికారులు. సంజయ్ ధింగ్రా, సిద్ధాంత్ గుప్తాలకు సంబంధించిన నకిలీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందం చర్యలు తీసుకుంది. విచారణలో వివిధ పత్రాలు కూడా లభించాయి. ఆర్థిక అవకతవకలపై విచారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోందని, భవిష్యత్తులో కూడా పలు కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ విషయంలో మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది.

Also Read: IND vs AUS: విరాట్‌ కోహ్లీ సెంచరీ చేస్తుంటే.. మా ప్లేయర్స్ ఏం చేశారో: క్లార్క్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు చోట్ల వివిధ కేసులకు సంబంధించి అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులలో అనేక చట్టపరమైన సమస్యలకు సంబంధించి అనేక పత్రాలు, అలాగే లెక్కకు రాని వందల కోట్ల రూపాయలను ప్రభుత్వ అధికారులు సీజ్ చేస్తున్నారు.

Also Read: Telangana Government: లగచర్లలో భూసేకరణ రద్దు.. ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్..