Site icon NTV Telugu

Srushti Hospital: సృష్టి ఆసుపత్రిపై ఈడీ కేసు నమోదు..

Ed

Ed

Srushti Hospital: సరోగసి పేరుతో పిల్లల ట్రాఫికింగ్ పాల్పడిన సృష్టి ఆసుపత్రి గురించి ఇదివరకు అనేక విషయాలు తెలిసాయి. ఆసుపత్రి సంబంధించిన వారు పేద కుటుంబాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సరోగసి పేరుతో అమ్మకాలు జరిపేవారు. ఇలా నాలుగేళ్లలో దాదాపు 500 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు అధికారులు. సరోగసి పేరుతో పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి ఏకంగా 50 లక్షల వరకు వసూలు చేసింది సృష్టి ఆసుపత్రి యాజమాన్యం.

OYO Room: డాక్టర్ కొంపముంచిన డేటింగ్ యాప్.. ఓయో రూమ్‌లో ఏకంగా?

ఈ వ్యాపారం దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ సెంటర్లు పెట్టి సరోగసి పేరుతో జరిపారు. ముఖ్యంగా గ్రామీణ దంపతులను ట్రాప్ చేసి పిల్లల్ని కొనుగోలు చేసిన సృష్టి ఆసుపత్రి వారి దగ్గరకు వచ్చే కస్టమర్స్ కు అమ్మేసేవారు. కొనుగోలు చేసిన పిల్లల్ని సరోగసి పేరుతో 50 లక్షల వరకు దంపతులకు అమ్మినట్లు అధికారులు తెలుసుకున్నారు. ఇక సరోగసి పేరుతో సృష్టి ఆసుపత్రి పేరుతో డాక్టర్ నమత్ర భారీగా నగదు వసూలు చేసింది. తాజాగా ఈ కేసు వ్యవహారంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఆమెను మరికొద్ది రోజుల్లో ఈడీ ప్రశ్నించనుంది.

Illegal Mining of Colored Stones: మన్యంలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు.. కోట్లలో విక్రయాలు..!

Exit mobile version