Site icon NTV Telugu

Election Commission: నేడు తెలంగాణకు ఎలక్షన్ కమిషన్

Ec

Ec

తెలంగాణలో ఎన్నికల పోరు మరింత హీట్ పెంచబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోఎలక్షన్ ఫీవర్ కనిపిస్తుండగా.. తాజాగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారుల రాకతో తెలంగాణ పూర్తిగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లబోతుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు.

Read Also: Chandrababu Case: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ

ఇక.. ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలంగాణలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సారథ్యంలోని 17 మంది అధికారుల బృందం హైదరాబాద్‌ చేరుకుని హోటల్‌ తాజ్‌కృష్ణాలో బస చేయనున్నారు. అక్కడే సమీక్షలు, సమావేశాలు నిర్వహించనున్నారు. పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ లతో ఈసీ సమావేశం కానుంది. సీఈసీ బృందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల రిలీజ్ కాబోతుంది.

Read Also: Minister KTR: నేడు జగిత్యాలలో మంత్రి కేటీఆర్ పర్యటన

సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, సన్నద్ధతపై సీఈసీ టీమ్ సమీక్షిస్తారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో ఈ మూడు రోజుల పాటు సమావేశం కానున్నారు. ప్రభుత్వపరంగా అందిస్తున్న సహకారంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతోనూ ఎన్నికల బృందం ప్రత్యేకంగా భేటీ కానుంది. పర్యటన చివరల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. మొత్తంగా.. సెంట్రల్‌ ఎలక్షన్ కమిషన్ టీమ్‌.. తెలంగాణలోని వివిధ విభాగాల అధికారులతో చర్చించిన అనంతరం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి షెడ్యూల్ విడుదలైతే అన్ని రాజకీయ పార్టీలు, నేతలు పూర్తిగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్లనున్నారు.

Exit mobile version