Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్‌క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ben Stokes: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), యువ పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson)కు నైట్‌క్లబ్ వివాదంలో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనలో ఇద్దరు ఆటగాళ్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్‌క్లబ్‌లో కనిపించగా.. అదే సమయంలో ప్రీమియర్‌షిప్ రగ్బీ క్లబ్ సారసెన్స్కు చెందిన ఓ ఆటగాడు జట్టు భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఈ ఘటనతో స్టోక్స్, అట్కిన్సన్ పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ వ్యవహారాన్ని పరిశీలించిన ఇండిపెండెంట్ క్రికెట్ రెగ్యులేటర్ అన్ని ఆధారాలను సమీక్షించిన తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని తేల్చింది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ.. ఎలాంటి రెగ్యులేటరీ ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించే ఆధారాలు లభించలేదని రెగ్యులేటర్ తన ప్రకటనలో పేర్కొంది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
దీంతో బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్లపై ఉన్న కెరియర్ అనిశ్చితికి తెరపడింది. ముఖ్యంగా గాయాల నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చిన స్టోక్స్‌కు ఈ నిర్ణయం మరింత ఊరటనిచ్చింది. ఇక ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్టు సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించగా.. ది ఓవల్‌లో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 200 పరుగులకు పైగా ఘన విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఇక చివరి టెస్ట్ జూన్ 25 నుంచి నాటింగ్‌హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. సిరీస్‌ను కైవసం చేసుకునేందుకు ఇరు జట్లు ఊవిళ్లు ఊరుతున్నాయి. బెన్ స్టోక్స్ అందుబాటులో ఉండటం ఇంగ్లండ్‌కు అదనపు బలాన్ని ఇవ్వగా.. న్యూజిలాండ్‌కు మ్యాచ్ మరో సవాల్‌గా మారనుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..