Sprouts: మొలకెత్తిన గింజలు (మొలకలు) మన భారతీయ ఇళ్లలో సర్వసాధారణం. కానీ వాటిని పచ్చిగా తినాలా లేదా ఉడికించి తినాలా? అనే విషయంలో చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే, ఇప్పుడు ఈ విషయం గురించి తెలుసుకుందాం. మొలకలు ఎంజైమ్‌లు, పీచు, విటమిన్లతో నిండి ఉంటాయి. అవి శక్తి, జీర్ణక్రియకు చాలా మంచివి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే.. మొలకలు తేమతో కూడిన వాతావరణంలో పెరుగుతాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా పెరగవచ్చు. కాబట్టి, వాటిని తినడానికి ముందు బాగా కడగండి. నిమ్మకాయ లేదా పసుపు నీటిలో నానబెట్టి ఆ తర్వాత తాజాగా తినండి. ఇది బ్యాక్టీరియాను తగ్గించి పోషకాలను కాపాడుతుంది.
గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 2,00,000 వరకు తగ్గనున్న KIA India Cars ధరలు..!
ఇక అదే, ఆవిరిపై ఉడికించిన మొలకలు సులభంగా జీర్ణమవుతాయి. కొద్దీ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి చేయడం వలన చాలావరకు బ్యాక్టీరియా నశిస్తుంది. ఇది వాటిని సురక్షితంగా ఉంచేలా చేస్తుంది. అంతేకాకుండా.. కొన్ని విటమిన్లు, ఖనిజాల శోషణ కూడా మెరుగుపడుతుంది. కానీ, వీటిలోని కరకరలాడే రుచి కాస్త తగ్గుతుంది. నిజానికి భారతీయ వంటకాల్లో మొలకలు ఎలా ఉన్న కానీ అద్భుతంగా కలిసిపోతాయి. పచ్చి మొలకలు సలాడ్‌లు, చాట్‌లకు బాగా సరిపోతాయి. ఉడికించిన మొలకలు కూరలు లేదా ఖిచిడీలకు సరైన ఎంపిక అవుతాయి.
మొత్తంగా, ఆవిరి చేయడం అనేది ఒక సురక్షితమైన పద్ధతి. ఇది బ్యాక్టీరియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. అలాగే పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. మీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, ఉడికించిన మొలకలను ఎంచుకోండి. మీకు మంచి జీర్ణశక్తి ఉంటే, మీరు మితంగా పచ్చి మొలకలను కూడా తినవచ్చు.
