తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోయాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే… తాళ్లపూడి మండలం పేద్దేవం గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పాడి గేదెలు చనిపోతుండడం గ్రామస్థులను తీవ్ర కలవరం పెట్టిస్తుంది. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 10 రోజులుగా మృత్యువాత పడుతున్నాయి. మూడు నెలల్లోనే 12 ఆవులకు పైగా చనిపోయాయి. చనిపోయిన ఒక్కొక్క పాడి గేదే విలువ లక్ష 50 వేల రూపాయలు వరకు ఉంటుంది. దీనితో పెద్దేవం గ్రామంలోని పాడి రైతుల్లో భయాందోళన నెలకొన్నయి. ఇక్కడే ఉంటే గేదెలు చనిపోతాయనే ఉద్దేశంతో ఇప్పటివరకు 50 పాడి గేదెలను రైతులు. సంత మార్కెట్లో అమ్మేశారు.
ముందు పశువుల మెడపై తెల్లటి దద్దురు లాంటి మచ్చ ఏర్పడి, ఇది పెరిగే కొద్దీ వీటి ఉష్ణోగ్రత పడిపోయాయని రైతులు వెల్లడించారు. అనంతరం గడ్డి, నీరు తీసుకోకపోవడంతో అవి నీరసించి చనిపోయాయని తెలిపారు. ఇదంతా రెండు మూడు రోజుల్లోనే జరుగుతుంది. ఈ నెల 13న కాకినాడ ప్రాంతీయ పశురోగ నిర్ధారణ సంస్థ, విజయవాడ లోని వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి ప్రయోగశాల వైద్యబృందం వ్యాధి సోకిన గేదెలను పరిశీలించింది. పశువులు తినే గ్రాసం, తాగే నీరు, పశువుల మలమూత్రాలు, పాలు తదితర వాటిని సేకరించి ల్యాబ్కు పట్టుకుని వెళ్లారు. . 15వ తేదీన కూడా మరొకసారి వైద్య బృందం పెద్దేవం గ్రామానికి విచ్చేసి పశువులను పరిశీలించారు.
