Site icon NTV Telugu

Maldives: మాల్దీవులపై భారత్ ఆగ్రహం.. విమాన బుకింగ్‌లు నిలిపివేత

Maldivus

Maldivus

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యల తర్వాత మాల్దీవులపై భారత్ ఆగ్రహం తగ్గుముఖం పట్టడం లేదు. సామాన్య ప్రజలతో పాటు భారతదేశంలోని ప్రముఖ ట్రావెల్ కంపెనీలు కూడా మాల్దీవులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ లోని అతిపెద్ద ట్రావెల్ కంపెనీ ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు తన అన్ని విమాన బుకింగ్‌లను క్యాన్సిల్ చేసింది. కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నిశాంత్ పిట్టి స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో ఈ సమాచారాన్ని అందించారు. ప్రధానికి సంఘీభావంగా ఈజీ మై ట్రిప్ (EaseMyTrip) మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించిందని నిశాంత్ పిట్టి చెప్పుకొచ్చారు.

Read Also: Kesineni Swetha: కేశినేని నాని మరో కీలక ప్రకటన.. ఇప్పుడు కేశినేని శ్వేత వంతు..

కాగా, మాల్దీవుల మహిళా మంత్రి షియునా ప్రధాని మోడీపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. అయితే, సదరు మంత్రి చేసిన కామెంట్స్ మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధం లేదని అవి ఆమె వ్యక్తిగత కామెంట్స్ అంటూ చెప్పుకొచ్చారు.. ఇక, మంత్రి వ్యాఖ్యలపై మాలేలోని భారత హైకమిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఈ నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కారణమైన ముగ్గురు మంత్రులు షియునాతో పాటు మల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్‌లను తక్షణమే వారి పదవుల నుంచి సస్పెండ్ చేసినట్లు మాల్దీవుల ప్రభుత్వ అధికార ప్రతినిధి, మంత్రి ఇబ్రహీం ఖలీల్ చెప్పుకొచ్చారు.

Read Also: Lord Shiva Stotram: సోమవారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే.. మృత్యు భయం తొలగిపోతుంది

అయితే, నిజానికి ఈ వ్యవహారమంతా ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత స్టార్ట్ అయింది. లక్షద్వీప్‌లో పర్యటించిన అనంతరం ప్రధాని మోడీ దాని చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో పాటు, ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేయాలని అతను భారతీయులకు విజ్ఞప్తి చేశాడు.. దీంతో మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రులు మోడీ పోస్ట్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు నేషనల్ పార్టీ ఒక పోస్ట్‌లో, ఒక విదేశీ దేశాధినేతపై ప్రభుత్వ అధికారి చేసిన జాత్యహంకార, అవమానకరమైన వ్యాఖ్యలను మాల్దీవులు నేషనల్ పార్టీ ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇది ఆమోదయోగ్యం కాదు. సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మాల్దీవుల ప్రతిపక్ష పార్టీ నేతలు కోరుతున్నారు.

Exit mobile version