Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఉదయం 8.05 గంటలకు భూకంప ప్రకంపనలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ఇచ్చింది. భూకంపం 173 కి.మీ లోతులో సంభవించగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. భూకంప కేంద్రాన్ని మాత్రం గుర్తించలేకపోయారు.
Read Also: Pakistan: పీఓకేలో అధిక విద్యుత్ బిల్లులు.. భారత్‌తో పోల్చి చూస్తున్న పాక్ ప్రజలు
ఆగస్టు 18న కూడా ఆఫ్ఘనిస్తాన్‌లో 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌కు పశ్చిమాన 423 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. ఆ రోజు ఉదయం 9.16 గంటలకు 100 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. 10 రోజుల్లోనే ఆఫ్ఘనిస్థాన్‌లో రెండు సార్లు భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ భూకంప ప్రభావిత ప్రాంతం అని, రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ భూప్రకంపనలు సంభవిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. దీని ప్రభావం పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్ వరకు కనిపిస్తుందని పేర్కొన్నారు. గత నెలలో కూడా భూకంపం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. అయితే ఈ సమయంలో కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.