NTV Telugu Site icon

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూ ప్రకంపనాలు

Andaman

Andaman

Earthquake : భారతదేశంలోని అండమాన్ నికోబార్ దీవులు వరుస భూ ప్రకంపనాలతో వణికిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం 2:59 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా నష్టం జరిగినట్లు నివేదిక లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం 10 కి.మీ లోతులో సంభవించింది. ఏప్రిల్ 6 న అండమాన్, నికోబార్ దీవులలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పోర్ట్ బ్లెయిర్‌కు 140 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. రాత్రి 10:47 గంటల ప్రాంతంలో భూకంపం వచ్చింది.

Read Also: GT vs KKR: పోరాడుతున్న కోల్‌కతా.. 10 ఓవర్లలో స్కోరు వివరాలు ఇలా..

ఉత్తర భారతదేశంలో గత నెలలో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు మార్చి నెలలో ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం అంతటా చాలా నిమిషాల పాటు బలమైన ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ రాజధాని ఖాట్మండ్ లో శనివారం తెల్లవారుజామున 3.04 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. 25కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైందని అధికారులు ప్రకటించారు. గత రెండు నెల కిత్రం (ఫిబ్రవరి)లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. గతంలో సంభవించిన భూకంపం వల్ల నేపాల్ దేశంలో భారీ నష్టం సంభవించింది.

Show comments