NTV Telugu Site icon

Earthquake: మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.4గా నమోదు

Earthquake

Earthquake

మణిపూర్‌లో భూకంపం సంభవించింది. కామ్‌జోంగ్‌లో ఈరోజు ఉదయం 5:32 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని పేర్కొంది.

ఇది కూాడా చదవండి: ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. ఫస్ట్ ప్లేసులో ఎవరంటే..?

జిల్లా వ్యాప్తంగా ప్రకంపనలు వచ్చాయని స్పష్టం చేసింది. ఈ భూప్రకంపనలతో ఎలాంటి నష్టం గానీ.. గాయాలు కానీ కాలేదని తెలుస్తోంది. స్వల్ప భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉండదని భూకంప శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదిలా ఉంటే భూప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలియక.. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు పెట్టారు.

ఇది కూాడా చదవండి: PM Modi: ఈనెల 18న వారణాసిలో మోడీ పర్యటన