Site icon NTV Telugu

Philippines: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 80కి పైగా ప్రకంపనలు

Earthquake

Earthquake

Earthquake in Philippines: సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో గురువారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రాణనష్టం లేదా గణనీయమైన నష్టం జరిగినట్లు నివేదికలు లేనప్పటికీ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. ఫిలిప్పీన్స్‌లోని మాస్బేట్ ప్రావిన్స్ తీరంలో తెల్లవారుజామున 2 గంటల తర్వాత బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం మాస్బేట్‌లోని ఉసన్ మునిసిపాలిటీలోని మియాగా తీర గ్రామం నుంచి 11 కిలోమీటర్ల (ఏడు మైళ్ళు) దూరంలో ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 80కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు ఫిలిప్పీన్స్ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. భూకంపం బలంగానే సంభవించిందని మాస్బేట్‌ ప్రావిన్షియల్ పోలీస్ చీఫ్ రోలీ అల్బానా చెప్పారు.

ఈ ప్రావిన్స్ మూడు ద్వీపాలలో దాదాపు పది లక్షల మంది జనాభాను కలిగి ఉంది. మాస్బేట్ ప్రావిన్షియల్ డిజాస్టర్ ఆఫీసర్ అడోనిస్ దిలావో స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని మాస్బేట్ సిటీలోని కొన్ని భవనాలు ప్రావిన్షియల్ హాస్పిటల్‌తో సహా వాటి గోడలలో పగుళ్లు ఉన్నాయని చెప్పారు. రోగులను ఆస్పత్రి నుండి తరలించినట్లు ఆయన తెలిపారు. నగరంలోని స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక లోపల సీలింగ్‌లోని ఒక భాగం కూడా కూలిపోయింది. విద్యుత్ పోస్ట్‌లు కదిలాయని, పార్క్ చేసిన కార్లు కూడా కదిలాయని అని దిలావో చెప్పారు. కొంతమంది నివాసితులు తమ ఇళ్లను వదిలి పారిపోయారని ఉసన్ పోలీసు చీఫ్ కెప్టెన్ రెడెన్ టోలెడో తెలిపారు.

Mysterious Sounds: మిస్టరీ ధ్వనులు, భూకంపం పుకార్లు.. ఆ నగరమంతా భయం భయం

దిమసలాంగ్ మునిసిపాలిటీలోని విపత్తు అధికారి గ్రెగోరియో అడిగ్ మాట్లాడుతూ.. ఆ ప్రాంతంలో భవనాలు, ఇతర నిర్మాణాలు దెబ్బతిన్నట్లు కనిపించడం లేదని తెలిపారు. మాస్బేట్ ప్రావిన్స్‌లో భాగమైన టికావో ద్వీపంలో, ఒక ఇంటిలోని నివాసితులు గోడ కూలిపోయిందని నివేదించారు. అయితే వారు క్షేమంగా ఉన్నారని శాన్ ఫెర్నాండో మునిసిపాలిటీలోని విపత్తు అధికారి కాన్సెన్సినో రేముండో చెప్పారు.

Exit mobile version