NTV Telugu Site icon

Earthquake in Jaipur: జైపూర్లో భూకంపం.. ఒక్క గంటల్లో మూడుసార్లు కంపించిన భూమి

Earthquake

Earthquake

Earthquake in Jaipur: రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. గంట వ్యవధిలో 3 సార్లు భూకంపం వచ్చింది. భూకంపం తీవ్రత 4.4గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. భూకంపం రావడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భూకంపం చాలా బలంగా ఉంది, దాని ప్రకంపనలు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కూడా కనిపించాయి.

భూకంపాలను పర్యవేక్షించే నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సిఎస్) ప్రకారం, శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు భూకంపం సంభవించింది. ఆ సమయంలో జైపూర్‌లో ప్రజలు గాఢనిద్రలో ఉన్నారు. బలమైన భూకంపం నగరం మొత్తాన్ని కదిలించింది. భూకంపం ధాటికి ఇళ్లన్నీ కదిలిపోయాయి. కొద్ది నిమిషాల తర్వాత 3.1 రిక్టర్ స్కేల్‌తో మరో భూకంపం సంభవించింది. కాసేపటి తర్వాత సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ 3.4గా నమోదైంది.

Read Also:Project K: ‘కల్కి’ గా దిగిన ప్రభాస్… హాలీవుడ్ రేంజ్ లో ఫస్ట్ గ్లింప్స్..

రాస్ప్‌బెర్రీ షేక్ అనే ప్రైవేట్ సీస్మోలాజికల్ ఆర్గనైజేషన్ ప్రకారం.. భూకంప కేంద్రం జైపూర్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భూకంపం ప్రభావం 35 కి.మీ దూరంలో ఉన్న బసి, 51 కి.మీ దూరంలో ఉన్న సంభార్, 53 కి.మీ దూరంలో ఉన్న మనోహర్‌పూర్, 55 కి.మీ దూరంలోని రింగాస్‌లో కూడా కనిపించింది. దీంతో పాటు సుదూర ప్రాంతాలైన దౌసా, షాహపురా, నివాయి తదితర ప్రాంతాల్లోని ఇళ్లు కూడా ప్రకంపనలతో వణికిపోయాయి.

Read Also:Chemicals In Breastmilk : తల్లి పాలల్లో విషపూరీతమైన రసాయనాలు..?

జైపూర్‌లో భూకంపం కారణంగా భవనాలు కంపించాయి. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో లేచి కూర్చున్నారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూడా కనిపించింది. భూకంపం ధాటికి ఎన్‌సీఆర్‌ భూమి కూడా కంపించింది. అయితే, ఎపిక్ సెంటర్‌కు దూరంగా ఉండటం వల్ల, ప్రజలు పెద్దగా అనుభూతి చెందలేకపోయారు.

Show comments