NTV Telugu Site icon

Earthquake: పాల్వంచలో భూప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన జనం

Earthquake

Earthquake

Earthquake: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. భూ ప్రకంపనల కారణంగా భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల సమయంలో చిన్నపాటి శబ్ధాలు కూడా వచ్చినట్లు స్థానికులు వెల్లడించారు. ఇంట్లోని వస్తువులు వాటంతట అవే కిందపడినట్లు వారు తెలిపారు.

Police Vehicle Theft: వీడు మామూలోడు కాదు.. పోలీస్ వెహికల్ నే ఎత్తుకెళ్లాడు

భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.2గా నమోదైంది. మధ్యాహ్నం 2.13గంటలకు భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. భూప్రకంపనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Show comments