లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల కోసం అద్భుతమైన స్కీ్మ్స్ ను తీసుకొస్తోంది. ఇటీవల మహిళల కోసం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఒక్క రూపాయి కట్టకుండానే నెలకు రూ. 7 వేలు పొందొచ్చు. బీమా సంస్థ ఎల్ఐసి బీమా సఖి యోజనను ప్రారంభించింది, ఇది మహిళలకు నెలవారీ ఆదాయం సంపాదించడానికి, వారిని శక్తివంతం చేయడానికి అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ పథకం మహిళా సాధికారతకు చొరవ చూపనుంది.
Also Read:Tollywood : పోటా పోటీగా అందాల ఆరబోత.. సినిమాకు ప్లస్ అవుతుందా
ఎల్ఐసి బీమా సఖి యోజన మహిళలకు ఎల్ఐసీ ఏజెంట్లుగా మారే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకంలో చేరిన వారికి శిక్షణ కూడా ఇస్తుంది. మహిళా ఏజెంట్‌కు ప్రతి నెలా జీతం రూపంలో డబ్బు అందజేస్తారు. మహిళా సమాజంలో బీమా గురించి అవగాహన కల్పించడానికి ఎల్ఐసీ ఈ చర్య తీసుకుంది. ఎల్ఐసీ బీమా సఖి యోజన కింద, మహిళా ఏజెంట్‌కు ఆమె పనితీరు ఆధారంగా మొదటి 3 సంవత్సరాలలో నెలవారీ మొత్తం అందిస్తారు. మొదటి సంవత్సరంలో నెలకు రూ. 7000 అందిస్తుంది.
Also Read:Ponnam Prabhakar: మంత్రి లోకేష్ ముందు ఇది తెలుసుకోండి.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
అర్హులు
దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు. దరఖాస్తుదారు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పథకం కింద, మొదటి సంవత్సరం నెలకు రూ. 7000 ఇస్తారు. ఈ పథకం కింద, రెండవ సంవత్సరం కూడా నెలకు రూ. 6000 అందుకోవచ్చు. కానీ షరతు ఏమిటంటే మొదటి సంవత్సరంలో తెరిచిన పాలసీలలో కనీసం 65 శాతం యాక్టివ్‌గా ఉండాలి. మీరు ఈ పథకానికి LIC కార్యాలయం లేదా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:Team India Creates History: సచిన్ అందుకోలేని రికార్డును సాధించిన ముగ్గురు టీమిండియా ప్లేయర్లు
అనర్హులు వీరే
ఎవరైనా ఇప్పటికే LIC ఏజెంట్ లేదా ఉద్యోగి మొదలైన వారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోలేరు. ఉద్యోగి బంధువులలో, భర్త లేదా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, అత్తమామలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. పదవీ విరమణ చేసిన కార్పొరేషన్ ఉద్యోగులు, మాజీ ఏజెంట్లు ఈ పథకానికి అర్హులు కారు.
Also Read:Alia Bhatt : ఏకంగా 5 నేషనల్ అవార్డులతో.. సత్తా చాటిన అలియా భట్ ‘గంగూబాయి’
ఏ పత్రాలు అవసరం?
వయస్సు ధృవీకరణ పత్రం
చిరునామా రుజువు
విద్యా అర్హత ధృవీకరణ
దరఖాస్తు ఫారంతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను జతచేయడం తప్పనిసరి.
