NTV Telugu Site icon

Bhole Baba: గతంలో భోలే బాబాపై డ్రగ్స్ అండ్ మిరాకిల్ రెమెడీస్ యాక్ట్ కింద కేసు..

Bhole Baba (3)

Bhole Baba (3)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. భోలేబాబాపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బాబాపై గతంలో ఓ కేసు నమోదైనట్లు వార్తులు బయటకు వచ్చాయి. సాకర్ విశ్వ హరి భోలేబాబాను 2000లో ఆగ్రాలో అరెస్టు చేశారు. అప్పట్లో అతనిపై డ్రగ్స్ అండ్ మిరాకిల్ రెమెడీస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ యాక్ట్ ప్రకారం.. మందులు, చికిత్స కంటే మంత్రాలు వ్యక్తిని బతికిస్తాయని నమ్మి.. ప్రలోభాలకు గురి చేస్తే.. ఈ యాక్ట్ వర్తిస్తుంది. అలా చేయడాన్ని గుర్తించదగిన నేరంగా చేస్తుంది. గతంలో బాబా అలంటి పనే చేశారు. చనిపోయిన అమ్మాయిని బతికిస్తానంటూ ప్రలోభాలు గురిచేసేందుకు యత్నించాడు. దీంతో 2000 డిసెంబర్ లో, సాకర్ విశ్వ హరి భోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ సహా 7 మందిని అరెస్టు చేశారు. అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో అందరినీ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. ఎఫ్‌ఐఆర్ కాపీ ఇంకా అందుబాటులో ఉంది.

READ MORE: Baba Vanga Predictions: “ఏలియన్స్, ప్రపంచం అంతం”.. భయపెడుతున్న బాబా వంగ జోస్యం..

పంకజ్ అనే స్థానిక వ్యక్తి 2000 సంవత్సరంలో జరిగిన ఆ సంఘటన గురించి మాట్లాడారు. “బాబాను దర్శించుకునేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆగ్రాలోని సాకర్ హరి అలియాస్ భోలే బాబా ఆశ్రమానికి భక్తులు వచ్చేవారు. బాబా 2000 డిసెంబర్ తర్వాత ఈ ఆశ్రమానికి రావడం మానేశారు. ఆయనకు పిల్లలు లేరు.ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఒకరోజు హఠాత్తుగా ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది. భోలే బాబా అనుచరులు బాబా ఆమెను నయం చేస్తారని చెప్పారు. కొంతసేపటి తర్వాత అకస్మాత్తుగా ఆమె చనిపోయింది. ఆ సమయంలో భోలే బాబా మృతదేహాన్ని దహనం చేయాలని కోరారు. మాల్ యొక్క ప్లాట్‌ఫారమ్‌ను శ్మశానవాటికకు తీసుకెళ్లారు. కాని అతని అనుచరులు భోలే బాబా వచ్చి బాలికను సజీవంగా తీసుకువస్తారని గట్టిగా చెప్పారు. నాలుగు పోలీసు స్టేషన్ల బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని, అనుచరులపై లాఠీచార్జి చేసి, సాకర్ హరి అలియాస్ భోలే బాబాను అరెస్టు చేశారు. వారి తరపున పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. అయితే సాక్ష్యాధారాలు లేకపోవడంతో సూరజ్‌పాల్ అలియాస్ సాకర్ హరి అలియాస్ భోలే బాబాతో సహా 7 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.” అని వివరించారు.