Site icon NTV Telugu

Eagle Team: రూ. 5 కోట్ల విలువైన గంజాయి పట్టివేత.. 455 గంజాయి ప్యాకెట్లు సీజ్

Ganja

Ganja

గంజాయి పెడ్లర్స్ భరతం పడుతోంది ఈగల్ టీమ్. గంజాయి, డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న వారి పట్ల ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఈగల్ టీమ్ భారీగా గంజాయిని పట్టుకుంది. ఏకంగా రూ. 5 కోట్లు విలువైన 935 కిలోల గంజాయిని సీజ్ చేసింది. బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఈగల్ టీమ్ పట్టుకుంది. ఒడిశా నుంచి మహారాష్ట్ర కు తరలిస్తుండగా పట్టుకుంది. 35 సంచుల్లోని 455 గంజాయి ప్యాకెట్లు సీజ్ చేశారు.

Also Read:XXX vs Union of India: సుప్రీంకోర్టు పిటిషన్‌లో గుర్తింపు దాచిన జస్టిస్ వర్మ.. “XXX”గా పేరు..

తెలంగాణ 2025లో అతి పెద్ద గంజాయి పట్టివేత ఇదే. గంజాయి ముఠాను గుట్టురట్టు చేసింది ఈగల్ టీమ్. ఖమ్మం-రాచకొండ నార్కోటిక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్. టాటా ఐచ్చర్ వాహనంలో ఫలమండీ ట్రే క్రింద దాచిన గంజాయి.. గంజా రవాణాకు ఎస్కార్ట్ చేసిన టయోటా ఇన్నోవా..మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠా పట్టుబడింది.. ముఠా సారధి పవార్ కుమార్ బాడు అరెస్ట్ అయ్యాడు.. సమాధాన్ భిస్, వినాయక్ పవార్ అరెస్ట్.. మొత్తం 455 ప్యాకెట్ల గంజా, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ ఫైనాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఛేదించిన ఈగల్ టీమ్.. పరారిలోనే సప్లేయర్స్ సచిన్ గంగారాం చౌచౌహాన్, విక్కీ సేథ్ లు.

Exit mobile version