Andhra Pradesh: రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వారం రోజుల పాటు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ స్థాయి నుంచి సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర యూనిట్లు, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఈ–ఆఫీస్‌ల సేవలను నిలిచిపోతాయని పేర్కొంది.. ఉన్నట్టుండి వారం రోజుల పాటు ఈ-ఆఫీస్‌ల సేవలు ఎందుకు నిలిపివేస్తున్నారనే అనుమానం రావొచ్చు.. అయితే, ప్రస్తుతం ఉన్న వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కు మార్పు చేస్తున్నందున.. ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు ప్రస్తుత పాత వెర్షన్‌లోని ఈ–ఆఫీస్ సేవలు నిలిచిపోతాయని.. ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి.
Read Also: Prabhas: హను సినిమా ఫిక్స్… కన్ఫర్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్
అయితే, ఈ వారం రోజుల పాటు ఆయా కార్యాలయాల్లో అత్యవసర సేవలు సజావుగా సాగేందుకు.. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎస్ జవహర్ రెడ్డి.. ఇక, కొత్త వెర్షన్ ఈ–ఆఫీస్‌లు పూర్తి స్థాయిలో వచ్చే నెల 1వ తేదీ నుంచి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయని వివరించారు.. అప్పటి వరకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అత్యవసర ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగేలా ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సారించాలని సూచించారు. కాగా, కొత్త వెర్షన్‌పై ఈ నెల 23, 24 తేదీల్లో గ్రామ పంచాయతీ స్థాయి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల వరకు మాస్టర్ శిక్షకులను డెవలప్ చేయనున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.