గతేడాదిలో పెండింగ్ బిల్లులు రూ. 40 వేల కోట్లు ఉన్నాయన్నారు ఆర్దిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ. అవి ప్రస్తుతం 21,673 వేల కోట్లకు తగ్గింది. కొంత మంది కాంట్రాక్టర్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎందుకు ఉన్నారో.. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో తెలీదు. రూ. 40 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నప్పుడు అందులో చాలామంది ధనికులుగా ఉన్నారేమో? ఆ విషయాలకు నేను సమాధానం చెప్పలేను. బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్న కారణంగా రూ. 1.80 లక్షల కోట్లని ఎలా ప్రచారం చేస్తారు?
Read Also: Minister RK Roja: లోకేష్ ఒక బఫూన్… ఒక ఐరన్ లెగ్ అంకుల్
టీడీపీ హయాంలో ఎన్ని బిల్లులు క్లియర్ అయ్యాయో నాకు తెలీదు. కొన్ని పెండింగులో ఉండి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్ పరిస్థితుల కారణంగా వేతనాలు అలస్యమై ఉండవచ్చు. గతంతో పోలిస్తే ఆదాయాలు తగ్గాయి. ఎప్పుడూ లేనట్టుగా రూ. 1.92 లక్షల కోట్లు డీబీటీల ద్వారా చెల్లించాం. ఆదాయం తగ్గి, అప్పులు పెరిగి, సంక్షేమ పథకాల అమలు వల్ల కొన్ని సార్లు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం జరగొచ్చు. జీఎస్టీ అమలైన తర్వాత రాష్ట్రానికి మొదట్లో ఆదాయాలు తగ్గాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. చాలా కారణాల వల్ల రాష్ట్రాల ఆదాయాల్లో రాజీ పడాల్సి వస్తోంది. అన్ని రాష్ట్రాల ద్రవ్యలోటుతో పోలిస్తే.. ద్రవ్యలోటు రూ. 25 వేల కోట్లకు దిగివచ్చిందన్నారు దువ్వూరి కృష్ణ.
Read Also: Mumbai Police : నిందితుడిని జైల్లో పెట్టుకుని.. 20ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నారు
