Site icon NTV Telugu

Dasara Holidays: విద్యార్థులకు పండగే.. ఈ నెల 21 నుంచే దసరా సెలవులు.. ఎప్పటి వరకు అంటే?

School

School

తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా వేడుకలు ఇంకో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. దసరా పండగ అనగానే విద్యార్థులకు సెలవులే గుర్తొస్తాయి. భారీగా సెలవులు ఉంటాయి కాబట్టి స్కూల్ వెళ్లే పనే ఉండదు.. హ్యాపీగా ట్రిప్స్ కు వెళ్లొచ్చు.. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు అని భావిస్తుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్కూల్లకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 21 నుండి వచ్చే నెల 3 వ తేదీ వరకు పాఠశాలలకి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుండి వచ్చేనెల 5 వ తేదీ వరకు జూనియర్ కాలేజి లకి దసరా సెలవులు ప్రకటించారు.

Exit mobile version