Site icon NTV Telugu

Indrakiladri : నేడు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనం

Kanakadurgamma

Kanakadurgamma

ఏపీలోని విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ్మమ ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అయితే.. నేడు మూడో రోజు ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారు ఆశ్వయుజ శుద్ధ తదియ సందర్భంగా గాయత్రీ దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కష్టాలు, ఉపద్రవాల నుండి గట్టెక్కిస్తుంది. అంతేకాదు గాయత్రీ దేవీని ఉపాసన చేయటంతో బుద్ధి తేజోవంతమవుతుంది.

 

ఐదు ముఖాలతో అమ్మవారు శంకు చక్ర గధ అంకుసాధులు ధరించి భక్తులను కాపాడుతుంటుంది. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం, ధరించి దర్శనమిస్తున్నా దుర్గమ్మను దర్శించుకోవటానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.  అమ్మవారి అలంకరణలలో గాయత్రీ దేవి అలంకరణ ప్రత్యేకం. అయితే.. గాయత్రీ అమ్మవారి మంత్రం జపం వలన నాలుగు వేదాలు చదివితే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

Exit mobile version