Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Duplicate Mro Fake Tahsildar Caught At Telangana Secretariat

Duplicate MRO: ఎంతకు తెగించార్రా.. సెక్రటేరియట్‭లో బయటపడ్డ నకిలీ తహసీల్దార్‌

Published Date :February 7, 2025 , 10:03 am
By Kothuru Ram Kumar
  • తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్‌చల్
  • సెక్రటేరియట్‭లో బయటపడ్డ నకిలీ తహసీల్దార్‌
  • జిరాక్స్ సెంటర్ లో చేసిన ఫేక్ ఐడీతో సెక్రటేరియట్‭లో హల్‌చల్.
Duplicate MRO: ఎంతకు తెగించార్రా.. సెక్రటేరియట్‭లో బయటపడ్డ నకిలీ తహసీల్దార్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

Duplicate MRO: తెలంగాణ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్‌చల్ కలకలం రేపుతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు నకిలీ ఉద్యోగిగా సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో నకిలీ తహసీల్దార్‌ను సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. కోమ్పల్లి ప్రాంతానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి తాను తహసీల్దార్‌గా పని చేస్తున్నట్లు పేర్కొంటూ నకిలీ ఐడీతో సచివాలయంలోకి ప్రవేశించాడు. తహసీల్దార్ స్టిక్కర్‌తో వాహనంలో వచ్చిన అతడిపై అనుమానం వచ్చి సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆపై సైఫాబాద్ పోలీసులకు అప్పగించిన అనంతరం విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అంజయ్య ఫేక్ ఐడీ కార్డు జిరాక్స్ సెంటర్‌లో తయారు చేసుకుని తహసీల్దార్‌గా వేషధారణ చేశాడని పోలీసులు గుర్తించారు. అతను సచివాలయంలోని మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీల చాంబర్లలో తిరుగుతూ అనుమానాస్పద ప్రవర్తన చూపించేవాడని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఇదే తీరు కొనసాగడంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిపై నిఘా పెట్టారు.

Also Read: Guntur: గుంటూరు జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 59 వెహికల్స్ సీజ్!

వివరాల్లోకి వెళ్లిన పోలీసులు, అంజయ్య సెక్రటేరియట్‌లో నకిలీ ఐడీతో దందాలు చేస్తున్నట్లు గుర్తించారు. తహసీల్దార్ స్టిక్కర్ ఉన్న కారులో సెక్రటేరియట్‌ ఆవరణలోకి ప్రవేశించి అక్కడ అధికారులుగా నటిస్తూ కొన్ని పనులు సాగించినట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో అతని పన్నాగం బయటపడింది. గత రెండు రోజుల క్రితం కూడా మరో నకిలీ ఉద్యోగి సెక్రటేరియట్ సిబ్బందికి చిక్కాడు. అప్పటి పరిణామాలు మరువక ముందే మరో నకిలీ వ్యక్తి పట్టుబడటం సెక్రటేరియట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ సెక్యూరిటీ సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. రోజుకు సుమారు 5 వేల మందికి పైగా సెక్రటేరియట్‌కు రావడంతో ప్రతి ఒక్కరి ఐడీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

నకిలీ ఐడీలతో సెక్రటేరియట్‌లోకి ప్రవేశించే ప్రయత్నాలు ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవని సెక్యూరిటీ సిబ్బంది స్పష్టం చేశారు. నకిలీ ఉద్యోగులపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నకిలీ ఐడీలతో సచివాలయంలోకి రానివ్వబోమని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మినహాయింపు ఉండదని హెచ్చరించారు. ప్రస్తుతం సైఫాబాద్ పోలీసులు అంజయ్యపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అతడు ఇంతకాలం ఎలాంటి దందాలు నిర్వహించాడో, నకిలీ ఐడీలతో ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలతో సచివాలయంలో భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Fake Employee
  • Fake ID
  • Fake Tahsildar
  • Secretariat
  • Secretariat News

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions