Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ద్విశతకంతో రాణించడంతో ఆ జట్టు 708 పరుగుల భారీ స్కోరు సాధించింది. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈస్ట్ జోన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ అత్యంత ఓపికగా బ్యాటింగ్ చేస్తూ 211 బంతుల్లో 99 పరుగులు చేసి కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. ఏడో వికెట్‌కు సి.వి. మిలింద్ (43)తో కలిసి తిలక్ వర్మ 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినప్పటికీ, మిలింద్ అవుట్ అయిన తర్వాత మిగిలిన బ్యాటర్లు త్వరగానే వెనుతిరిగారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేష్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ షమీ, కునైన్ ఖురేషీ, శిఖర్ మోహన్ చెరో రెండు వికెట్లు సాధించారు.
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (3), వైభవ్ సూర్యవంశీ (8) అతి తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. వైభవ్‌ను త్రిపురాణ విజయ్ స్టంపింగ్ ద్వారా అవుట్ చేశాడు. అయితే ప్రారంభ వికెట్లు త్వరగా కోల్పోయినప్పటికీ, కెప్టెన్ ఇషాన్ కిషన్ మ్యాచ్‌లో మరో అర్ధశతకంతో రాణించి శిఖర్ మోహన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసి, మొత్తం 584 పరుగుల భారీ ఆధిక్యంతో పూర్తి విజయావకాశాలను తన చేతుల్లోకి తీసుకుంది.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ టోర్నీలో ఇరు జట్ల ఆటగాళ్లు ఆకట్టుకునే గణాంకాలను నమోదు చేశారు. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ దులీప్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా నిలిచి, మూడు మ్యాచ్‌ల్లో 104.91 స్ట్రైక్ రేట్‌తో 192 పరుగులు సాధించాడు. మరోవైపు కెప్టెన్ ఇషాన్ కిషన్ మూడు మ్యాచ్‌ల్లో ఫైనల్ ద్విశతకంతో కలిపి 370కి పైగా పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా రెండు మ్యాచ్‌ల్లో ఒక శతకం, రెండు అర్ధశతకాలతో మొత్తం 266 పరుగులు సాధించి టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!