NTV Telugu Site icon

Duleep Trophy 2024: సెంచరీ చేసిన ప్రథమ్ సింగ్.. భారీ లీడ్‭లో ఇండియా A జట్టు..

25

25

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ మూడో మ్యాచ్‌లో ఇండియా A ఓపెనర్ ప్రథమ్ సింగ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ (122) సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా A జట్టు 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా D 183 పరుగులు మాత్రమే చేసింది. ప్రథమ్ రెండో ఇన్నింగ్స్‌లో తన ఇన్నింగ్స్‌ను సాఫీగా కొనసాగించాడు. చెత్త బంతుల్లో భారీ షాట్లు కొడుతూ సెంచరీ పూర్తి చేశాడు. ఇకపోతే మొదటి ఇన్నింగ్స్ లో మొదటి వికెట్‌కు మయాంక్ అగర్వాల్‌తో కలిసి ప్రథమ్ 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో తొలి 33 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ 56 పరుగులు చేశాడు. అతని అవుట్ అయిన తర్వాత, ప్రథమ్ తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. మ్యాచ్ మూడో రోజు సెంచరీ పూర్తి చేశాడు. 189 బంతుల్లో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని బ్యాట్ నుంచి 12 ఫోర్లు, ఒక సిక్స్ వచ్చాయి.

Nadendla Manohar: లీడర్లు అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్.. స్పందించే మనసు ఉండాలి..

ఇకపోతే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 32 ఏళ్ల ప్రథమ్‌కి ఇది రెండో సెంచరీ. అతను ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు ఆడాడు. అతని 50 ఇన్నింగ్స్‌ లలో 35 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు. ఇప్పటివరకు 1,697 పరుగులు వచ్చాయి. ఇందులో 2 సెంచరీలతో పాటు 10 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. రైల్వే క్రికెట్ జట్టులో ఈ ఆటగాడి అత్యుత్తమ స్కోరు 169* పరుగులు. ప్రథమ్ ఢిల్లీ నివాసి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ప్రథమ్ గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) జట్లలో భాగంగా ఉన్నాడు.

MS Dhoni Angry: ధోనీ కోపాన్ని నేను చూశా.. ఒక్కసారిగా బయపడిపోయా: బద్రీనాథ్

తొలి మ్యాచ్‌లో ప్రథమ్‌కు అవకాశం రాలేదు. అప్పుడు జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ ఉండడంతో అవకాశం దక్క లేదు. ఆ మ్యాచ్‌లో ఇండియా-బి 76 పరుగుల తేడాతో ఇండియా-ఎపై విజయం సాధించి టోర్నీని సానుకూలంగా ప్రారంభించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 275 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఎ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 198 పరుగులకు ఆలౌటైంది. ఇక ప్రస్తుతం ఇండియా A 370 పరుగుల లీడ్ లో కొనసాగుతుంది.