NTV Telugu Site icon

Pregnant Cars: ఇదేందయ్యా ఇది.. కార్లేంటి ఇలా అయిపోయాయి..

Pregnant Cars

Pregnant Cars

Pregnant Cars: దాదాపు 80 రోజులుగా చైనాలో హీట్ వేవ్ కొనసాగుతోంది. దీని కారణంగా ఆ దేశంలో 260 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఓ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సంఘటన మునుపెన్నడూ చూడలేదు. చైనీస్ కార్లు మొందుభాగాలు ఒక బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారుతున్నాయి. నిజానికి హీట్ వేవ్ కారణంగా.., కారుపై ఉన్న ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ చాలా కరిగిపోయింది. దాని మెటల్ దాని ఉపరితలం నుండి వేరు చేయబడింది. దాని వల్ల వేడి కారణంగా ఉబ్బుతుంది. కారు బానెట్, సైడ్‌ లు, వెనుక ట్రంక్‌పై బెలూన్ లాంటి ఆకారంలా కనపడుతోంది. ఇక వీటిని చుసిన నెటిజన్స్ కార్లను “గర్భిణీ కారు” అని పిలుస్తున్నారు. ఈ సీన్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.

Viral Video: ఆహా.. ఆ టీచర్ బోధన స్టైలే వేరప్ప.. ఎంత సులువుగా నేర్పిస్తుందంటే..?

ఇకపోతే., కార్లపై వర్తించే ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదదు. ఈ రంగు ఉన్న పోర అవసరమైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వస్తే అది ఈ పద్ధతిలో ఉబ్బుతుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనీస్ కార్లే కాదు.. జర్మన్ కార్లు కూడా ప్రెగ్నెంట్ అయిపోయాయని అంటున్నారు. దీనికి సంబంధించి, చైనా మార్కెట్లో నకిలీ కార్ ప్రొటెక్షన్ పెయింట్ గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలో ప్రమాదకరమైన హీట్ వేవ్ కొనసాగుతుండటం గమనార్హం. దీని కారణంగా చైనాలో కూడా ఇద్దరు మరణించారు. ప్రజలు అస్వస్థతకు గురికావడంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చైనా తూర్పు తీరంలో వరుసగా ఎనిమిది రోజులుగా వేడిగాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారతదేశంలో బ్రహ్మపుత్ర అని పిలువబడే యాంగ్జీ నదిలో నీటి మట్టం చాలా తక్కువగా ఉంది.

Show comments