NTV Telugu Site icon

Uttar Pradesh: నేలకూలిన విమాన ఇంధన ట్యాంక్‌లు.. ఆ లోపం వల్లే..!

Flights

Flights

ఉత్తరప్రదేశ్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో IAF విమానానికి చెందిన ఇంధన ట్యాంక్‌లను పోలీసులు గుర్తించారు. వాటిని శిక్షణ కోసం వాడుతామని.. ఆ యుద్ధ విమానాలు తమవే అంటూ భారత వైమానిక దళం తెలిపింది. “గోరఖ్‌పూర్ నుండి శిక్షణ మిషన్ కోసం ఒక యుద్ధ విమానం గగనతలంలో ప్రయాణిస్తుండగా.. ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానంలో ఉన్న ఇంధన ట్యాంకులను తొలగించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక మీడియా తెలుపుతుంది.

Former VRA : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ వీఆర్ఏలు

మేలో.. రష్యాలో తయారైన మిగ్-21 మిలిటరీ విమానం “ఆన్‌బోర్డ్ ఎమర్జెన్సీ”ని ఎదుర్కొని ఒక ఇంటిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ ప్రమాదం రాజస్థాన్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో ఫైలట్ సురక్షితంగా బయటపడినట్లు భారత వైమానిక దళం తెలిపింది. మరోవైపు ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినందుకు ఐఏఎఫ్ విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపింది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.