NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. సింగరేణి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిందని ఆయన అన్నారు. సింగరేణికే గనులు అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు కిషన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. ప్రభుత్త్వ రంగ సంస్థలకే బొగ్గు గనుల కేటాయింపు జరగాలన్నారు. కేంద్ర నిర్ణయం సరికాదు.. రాష్ట్రంలో ఉన్న గనులు… ప్రభుత్వ సంస్థలకు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని, సీఎం త్వరలో ప్రధాని ని కలుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర సమస్యలు..సహకారం.. సింగరేణి అంశాలు ప్రధాని దృష్టికి తీసుకెళ్తారని, వేలంలో పాల్గొనాలో వద్దో నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.

మా ఆలోచన సింగరేణి సంస్థ కి చెప్పామని శ్రీధర్‌ బాబు అన్నారు. శాంతి భద్రతల విషయం లో కఠినంగా ఉంటామని, ఉక్కుపాదం తో అణచివేస్తామని ఆయన తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుండి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదని, బీఆర్‌ఎస్‌ ఆలోచన చూస్తుంటే జాలి వేస్తుందని ఆయన అన్నారు. టీడీపీ నుండి నేర్చుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళు అని ఆయన వ్యాఖ్యానించారు. స్పీడ్ గా నిర్ణయాలి తీసుకుంటే కాళేశ్వరం లెక్క ఐతదని, మేడిగడ్డ విషయంలో NDSA నివేదిక మేరకే పనులు అని ఆయన తెలిపారు. రిపేర్లు చేసినా..కూలిపోదు అనే గ్యారంటీ లేదు అని నిపుణుల కమిటీ చెప్పిందన్నారు. ఇసుక సిల్ట్.. నిపుణుల సూచన మేరకే తీస్తుందని, ధర్నా చేస్తున్న విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ అని, మీ ఆలోచన మేరకు ఉద్యోగాల భర్తీ అని ఆయన వ్యాఖ్యానించారు.