NTV Telugu Site icon

Kotha Prabhakar Reddy: పిల్లల నుంచి పెద్దల దాకా ప్రభుత్వ పాలనతో విసిగిపోయారు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Thu

Thu

Kotha Prabhakar Reddy: సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా జరిగిన బహిరంగ సుమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ.. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాక, అవసరమైతే కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తాము భరిస్తామని వాళ్లు చెప్పినట్టు వెల్లడించారు.

Read Also: Hyderabad Crime: ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. వృద్ధురాలిని హత్య చేసి మృతదేహంపై డాన్స్

అంతేకాకుండా.. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు చేసిన పనులకు బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలుగా మారాయి. చుడాలిమరి ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎలాంటి ప్రతిస్పందన ఇస్తుందో.