Drunk UP Man Drags Car With Container Truck: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ ట్రక్కు డ్రైవర్ తాగిన మత్తులో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో ఓ కారును ఢీకొట్టి 3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లాడు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. ట్రక్కు కారును లాక్కెళ్తున్న సమయంలోనే వారంతా బయటకు దూకేశారు. ఈ ఘటన పార్థాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రీతానీ ప్రాంతంలో కారు డ్రైవర్ యూటర్న్ తీసుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ట్రక్కు.. కారును ఢీకొట్టింది. ఆ డ్రైవర్ అంతటితో ఆగకుండా కారును అలాగే ఈడ్చుకెళ్లాడు.
220 Couples Married: ఒకే వేదికపై 220 జంటల పెళ్లి.. ప్రతి జంటకు మంచం, పరపు, దుప్పట్లు, బీరువా..
మూడు కిలోమీటర్లు వెళ్లిన తర్వాత ఓ డంపర్‌ను ఢీకొట్టాడు. దీంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. ఈ ఘటనలో కారు టైర్లు ఊడిపోయాయి. ట్రక్కును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని కారు యజమాని అనిల్ కుమార్ ఆరోపించాడు. తాము వారించినా ట్రక్కును ఆపకుండా వెళ్లిపోయాడని చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. చుట్టుపక్కలవారు షాక్‌తో చూస్తుండగానే కారును సుమారు 3 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. బాలీవుడ్ సినిమాను తలపించే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Uttar Pradesh | In #Meerut, a truck driver dragged a car for several kilometers with the truck. Four youths were sitting in the car, somehow the youths saved their lives by jumping in a hurry. #UttarPradesh #Viral #Video pic.twitter.com/wP7XVnhQqp
— Madhaw Tiwari (@MadhawTiwari) February 13, 2023