Site icon NTV Telugu

Rayadurg Hospital Incident: ఏ బాబు లెగు.. తప్పతాగి పడిపోయిన ఉద్యోగి

Hospital Incident

Hospital Incident

Rayadurg Hospital Incident: ఆయనో ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ బేసిక్ రేడియాలజీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. సాధారణంగా అయితే ఆయన బాధ్యత గల ఉద్యోగిగా తన విధులను సక్రమంగా నిర్వహించాలి. అలా చేస్తే ఇలా వార్తల్లోకి ఎక్కేవాడు కాదు. తప్పతాగి బట్టలు లేకుండా ఆస్పత్రిలో పడిపోయాడు. ఏ బాబు లెగు అంటూ స్థానికులు ఎంత లేపడానికి ప్రయత్నించిన ఆయన మద్యం మత్తు నుంచి బయటికి రాలేదు. ఈ కథ అంతా ఎక్కడ జరిగిందంటే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగుచూసింది.

READ ALSO: Pakistan: వరదలకు పాకిస్తాన్ రక్షణ మంత్రి వింత పరిష్కారం.. ఏం చెప్పారంటే..

అసలు ఏం జరిగిందంటే..
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో మదన్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ బేసిక్ రేడియాలజీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆయన మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. తప్పతాగి ఏకంగా ఎక్స్‌రే రూమ్‌లో దస్తులు లేకుండా పడి పోయాడు. ఆస్పత్రికి వచ్చిన రోగులు, వారి బంధువులు ఉద్యోగి తీరును చూసి ఆశ్చర్యపోయారు. చేసేది లేక ఏ బాబు లెగు అంటూ
స్థానికులు లేపడానికి ప్రయత్నించిన మద్యం మత్తులో ఉన్న మదన్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రోగులు, వారి బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ఉద్యోగం మీద బాధ్యత లేని మదన్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది ఈ విధంగా బాధ్యతలు మరిచి ప్రవర్తించడం సిగ్గు చేటని అన్నారు. వెంటనే ఉన్నతాధికారులు ఈ ఘటనపై స్పందించాలని కోరారు.

READ ALSO: London Accident : యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి లండన్‌లో విషాదం

Exit mobile version