Drunk Driving: ఈ మధ్యకాలంలో కొందరు యువత పబ్లిక్ లో కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఎక్కువ అయిపోయింది. కొంతమంది యువతీ యువకులు చుట్టుపక్కల ఏమి జరుగుతున్న పట్టించుకోకుండా పబ్లిక్ లోనే సరసాలు కాని చేస్తున్న సంఘటనలు సంబంధించిన వీడియోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తన ప్రియురాలితో, స్నేహితులతో మద్యం మత్తులో బెట్టింగ్ వేశాడు ఓ యువకుడు. ఇందులో భాగంగా యువకుడు కారును సముద్రంలోకి తీసుకువెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
Vijayawada Diarrhea: విజయవాడలో డయేరియా విజృంభణ.. 100 దాటిన కేసులు!
కడలూర్ హార్బర్ – పరంగిపేట తీరప్రాంతం వద్ద సముద్రంలోకి ఎవరు కారు నడుపుతారని బెట్టింగ్ వేసుకున్నారు చెన్నై చెందిన ఐదుగురు యువకులు. దానితో గూగుల్ మ్యాప్ పెట్టుకుని మద్యం మత్తులో ఓ యువకుడు తాను వెళ్లి చూపిస్తానని లవర్ తో సవాల్ చేసి కారుని సముద్రంలోకి తీసుక వెళ్ళాడు. కడలూర్ సమీప సోధికుప్పం వద్ద కారులోని నలుగురిని రోడ్డుపై దించిన యువకుడు కారును మ్యాప్ చూస్తూ సముద్రంలోకి పోనిచ్చాడు.
Congress Vs BJP: మోడీని తల్లి హెచ్చరిస్తున్నట్లు ఏఐ వీడియో విడుదల.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం
అలా జరిగిన కొద్దిసేపటికి.. సముద్రంలో అలలకు కోట్టుకునిపోయి తేలుతున్న కారును గుర్తించిన మత్స్యకారులు పోలీసులకుసమాచారం ఇచ్చారు. దానితో రంగంలోకి దిగిన పోలీసులు సముద్రంలో చిక్కుకున్న కారును ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు తీసుకవచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
