NTV Telugu Site icon

Delhi: ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌కు వేధింపులు.. వీడియో వైరల్

Swati Maliwal

Swati Maliwal

Delhi: ఢిల్లీలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ను ఓ వ్యక్తం మద్యం మత్తులో వేధింపులకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో స్వాతి చేయి కారులో ఉండగానే ఆ నిందితుడు వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఢిల్లీలో మహిళ భద్రతను పరిశీలించేందుకు తన బృందంతో కలిసి ఆమె రోడ్డు మీదకు వచ్చారు. గురువారం తెల్లవారు జామున ఎయిమ్స్‌ ఆసుపత్రి సమీపంలో నిల్చొని ఉండగా ఆమె వద్దకు ఓ బాలెనోకారు వచ్చి ఆగింది. కార్లో వచ్చి కూర్చొమని ఆ వ్యక్తి స్వాతిని అడిగాడు.. దీనికి ఆమె స్పందిస్తూ.. సారీ మీ మాటలు వినిపించడం లేదు.. మీరు నన్ను ఎక్కడ డ్రాప్‌ చేస్తారని అడిగింది. వెంటనే మలివాల్ కాస్తా దూరంగా వెళ్లడంతో ఆ వ్యక్తి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

దీని తర్వాత కాసేపటికి యూటర్న్‌ తీసుకుని వచ్చి మళ్లీ తిరిగి వచ్చి కారు డ్రైవర్‌ ఆమెను ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. దానికి మాలీవాలీ నేను ఇంటికి వెళ్లాలి. బంధువులు వస్తు్న్నారని సమాధానం ఇచ్చారు. మళ్లీ రావడంతో అనుమానం వచ్చిన ఆమె ఆ కారు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నన్ను ఎక్కడికి తీసుకెళ్లానుకుంటున్నావ్.. అంటూ ఆగ్రహంతో అతన్ని పట్టుకోవాలని ప్రయత్నించింది. ఆ నిందితుడు వెంటనే కారు అద్దాలను మూసేయాలని ప్రయత్నిస్తూ.. అలానే కారును ముందుకు పోనిచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమెను 15 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. ఆమె ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని 47 ఏళ్ల హరీష్‌ చంద్రగా గుర్తించిన పోలీసులు.. ఫిర్యాదు అందిన 22 నిమిషాల్లోనే అతన్ని అరెస్ట్‌ చేశారు. బాలెనో కారును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. అతడిని న్యాయస్థానం 14 రోజుల కస్టడీకి అప్పగించింది.

Congo Boat Accident: ఘోర పడవ ప్రమాదం.. 145 మంది జలసమాధి

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కే ఇలా జరిగితే సాధారణ మహిళల పరిస్థితి ఏంటని స్వాతి మాలీవాల్ ట్వీట్ చేశారు. సమయానికి తన బృందం అందుబాటులో లేకుంటే తన పరిస్థితి కూడా అంజలిలా మారేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో బయటకు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఢిల్లీ పోలీసులు, ఇక్కడి మహిళల భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కూడా టార్గెట్ చేశారు.