NTV Telugu Site icon

Karnataka: ఆపరేషన్ థియేటర్లోనే తప్ప తాగిపడిపోయిన డాక్టర్

Drunk Doctor

Drunk Doctor

Karnataka: కర్ణాటకలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వైద్యుడు మద్యం మత్తులో ఆపరేషన్‌ చేసే ముందు ఆపరేషన్‌ థియేటర్‌లో పడిపోయాడు. వైద్యుడిని బాలకృష్ణగా గుర్తించారు. రోగులకు శస్త్ర చికిత్స చేయాల్సిన రోజు ఉదయం నుంచి డాక్టర్‌ ఆపరేషన్‌ థియేటర్‌లోనే నిద్రిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటన తర్వాత డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read Also:Mohan Babu: మోహన్ బాబు వంద కోట్ల సినిమా.. ప్రొడ్యూసర్ ఎవరంటే..?

ఈ ఘటన చిక్కమగళూరు ఆస్పత్రిలో జరిగింది. ఇక్కడ తొమ్మిది మంది రోగులకు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. వారంతా స్త్రీలే. మధ్యాహ్నం 2 గంటలకు శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా, ఉదయం 8 గంటల ప్రాంతంలో రోగులకు అనస్థీషియా ఇచ్చినట్లు సమాచారం. ఆపరేషన్ ప్రారంభించే ముందు డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లో మద్యం మత్తులో ఉండి స్పృహతప్పి పడిపోయాడు.

Read Also:WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో వారితో ప్రమాదమంటున్న రిక్కీ పాంటింగ్

అదే సమయంలో వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్‌ చేశారు. దీనితో పాటు వైద్యుడికి మందు అలవాటు ఫుల్ గా ఉందని తెలిపారు. ఇంతకు ముందు కూడా అతను చాలాసార్లు మత్తులో చిక్కుకున్నాడు. ఈ విషయంలో చిక్కమగళూరు ఆస్పత్రి పాలకవర్గం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని, దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>Drunk doctor at Chikkamagaluru hospital collapses in operation theatre moments before performing surgeries <a href=”https://t.co/gtTNbrAWqL”>pic.twitter.com/gtTNbrAWqL</a></p>&mdash; The Contrarian 🇮🇳 (@Contrarian_View) <a href=”https://twitter.com/Contrarian_View/status/1664201972348755968?ref_src=twsrc%5Etfw”>June 1, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

Show comments