Assam: అస్సాం భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పోలీసుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) గురువారం రాత్రి ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేసింది. వారి వద్ద నుండి 7.25 కోట్ల రూపాయల విలువైన 29,000 యాబా టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. డిఐజి (ఎస్‌టిఎఫ్) పార్థ సారథి మహంత్ ఎఎన్‌ఐకి ఇచ్చిన సమాచారం మేరకు గౌహతిలోని గోర్చుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథబరి ప్రాంతంలో ఎస్‌టిఎఫ్ బృందం ఆపరేషన్ నిర్వహించింది. ఆయన మాట్లాడుతూ, “ఆపరేషన్ సమయంలో గౌహతి నగరంలోని గోర్చుక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథబరి ప్రాంతంలో మేము 29,000 యాబా టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నాం. మేము స్మగ్లర్ల అద్దె ఇంటి నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసాం.” అని పేర్కొన్నారు. అరెస్టయిన వారిని బార్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కథబరీకి చెందిన ముజక్కిర్ హుస్సేన్, భేలాకు చెందిన సైఫుల్ ఇస్లామ్‌గా గుర్తించారు.
Read Also:Tunnel Accident: టన్నెల్ నుంచి కార్మికులను ఎలా బయటకు తీస్తారో తెలుసా?
అంతకు ముందు నవంబర్ 8వ తేదీన కూడా అసోంలోని మూడు జిల్లాల నుంచి సుమారు రూ.6.7 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ సహా ఆరుగురిని అరెస్టు చేశారు. కామ్రూప్ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం మణిపూర్ నుండి వస్తున్న వాహనాన్ని అమింగ్‌గావ్ వద్ద ఆపి 36 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ (ఎస్‌టిఎఫ్) కళ్యాణ్ కుమార్ పాఠక్ తెలిపారు. 36 ప్యాకెట్లలో ఉంచిన ఈ డ్రగ్‌ను పంజాబ్ వెళ్లే వాహనంలోని రహస్య గదుల్లో దాచి ఉంచినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పట్టుబడిన నల్లమందు విలువ రూ.6 కోట్లు ఉంటుందని అంచనా. మరో సంఘటనలో, కర్బీ అంగ్లాంగ్ జిల్లాలోని ఖత్‌ఖాతి ప్రాంతంలో ఒక వాహనం నుండి 32.2 గ్రాముల హెరాయిన్‌ను పెట్రోలింగ్ బృందం స్వాధీనం చేసుకుంది. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది కాకుండా, పోలీసులు 42.5 గ్రాముల హెరాయిన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. గౌహతిలోని ఖానాపరా ప్రాంతానికి చెందిన ఒక మహిళను అరెస్టు చేశారు.
Read Also:Japan Movie: ‘జపాన్ ‘ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?