Site icon NTV Telugu

Drugs In Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్..

Drugs

Drugs

Drugs In Hyderabad: మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసారు రాజేంద్రనగర్ పోలీసులు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసారు పోలీసులు. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇక ఈ డ్రగ్స్ సరఫరా బెంగుళూరు నుండి హైదరాబాద్ కు జరుగుతోంది. అలా చేరుకున్న తర్వాత హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు కేటుగాళ్లు‌. భార్య, భర్త తో పాటు మరో‌ ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా కొనసాగుతోంది ఈ డ్రగ్స్ దందా. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో నైజీరియాకు చెందిన తంబ ఫైడెల్మా ను జైల్ కు తరలించారు అధికారులు.

100 Feet Road : శరవేగంగా బండ్లగూడ-ఎర్రకుంట రహదారి విస్తరణ పనులు

సన్ సిటీని అడ్డాగా చేసుకొని కొనసాగుతుంది ఈ డ్రగ్స్ దందా. బెంగుళూరు నుండి డ్రగ్స్ తీసుకొని వచ్చిన ఈ నైజీరియా లేడీ కిలాడి.. బండ్లగుడా సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ దందాకు భార్య భర్తలు తెరలేపారు. గతంలో కూడా డ్రగ్స్ విక్రయిస్తూ భర్త పట్టుబడాడ్డు. బెంగుళూరుకు చెందిన మైటీ గాడ్ అనే డ్రగ్స్ సప్లయర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం. గత కొంత కాలంగా వీరు మైటీ గాడ్ అనే డ్రగ్స్ సప్లయర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయం చేస్తున్నారు.

Exit mobile version