Site icon NTV Telugu

Drugs : డ్రగ్స్ కు అడ్డగా పబ్బులు.. ఎన్ని సార్లు రైడ్లు చేసినా..!

Pubs

Pubs

హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? అని ఎవరైనా అడిగితే పబ్స్‌లో దొరుకుతాయని ఈజీగా సమాధానం చెప్పవచ్చు. అంతలా డ్రగ్స్ దందా అక్కడ నడుస్తోంది. ఏకంగా కొంత మంది డీజేలే పెడ్లర్ల అవతారం ఎత్తి వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పబ్బులు.హైదరాబాద్‌లో పబ్బులు.. డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.. పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు. ఒక్కసారి రెండుసార్లు కాదు.. పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసినా.. డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. అంతే కాదు డ్రగ్స్‌ వినియోగంలో పబ్బుల తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. .హైదరాబాద్‌ పబ్బులలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని మీడియా ఎప్పటి నుంచో చెబుతోంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ మాదక ద్రవ్యాల సప్లై మాత్రం ఆగడం లేదు…డ్రగ్స్ సప్లై చేస్తున్న డీజేలు.

ముఖ్యంగా పబ్‌లలో డ్రగ్స్‌ను.. అక్కడ పని చేసే డిస్క్ జాకీలు లేదా డీజేలు సప్లై చేస్తున్నారనే విషయం బయటపడింది. పెద్ద పెద్ద పబ్బులలో పనిచేస్తున్న డీజేలు తమ సైడు బిజినెస్‌గా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాదులో పోలీసులు ఆకస్మికంగా పబ్బుల పైన సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రగ్స్ గురించి సమాచారం అందిన తర్వాత గచ్చిబౌలి, మాదాపూర్‌లోని రెండు పబ్‌లపై దాడి చేశారు. పోలీసులు ఆన్-సైట్ డ్రగ్ పరీక్షలు నిర్వహించగా… నలుగురు యువకులకు పాజిటివ్‌గా తేలింది. పోలీసులకు దొరికిన వారంతా కూడా డీజేలే ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పనిచేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని క్లబ్ రోగ్, ఫ్రాట్ హౌస్ పబ్‌లలో ఈ తనిఖీలు చేశారు పోలీసులు…

పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే అవకాశం . ఈ దాడుల్లో పోలీసులు అనేక మంది కస్టమర్లు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. స్థానికంగా నిర్వహించిన మాదకద్రవ్య పరీక్షల్లో నలుగురు వ్యక్తులు గంజాయి సేవించినట్లు నిర్ధారించారు. వారిని మాదాపూర్ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేశారు. తమ ప్రాంగణంలో డ్రగ్ సంబంధిత కార్యకలాపాలను అనుమతించినందుకు పబ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు… ఈ సంఘటన తర్వాత, మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడానికి, చట్టపరమైన నిబంధనలను పాటించేలా చూడటానికి హైదరాబాద్ అంతటా నైట్ లైఫ్ సంస్థల పర్యవేక్షణను పెంచాలని పోలీసులు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది..

Exit mobile version