Site icon NTV Telugu

Medical shops: రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా.. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరు

Eluru

Eluru

తూర్పుగోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా రెచ్చిపోతున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. డాక్టర్ ప్రిస్కిప్షన్‌ లేకుండా నిషేధిత మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు గుర్తించారు. నిషేధిత మందులు ఎమ్మార్పి కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. వయాగ్రా ట్యాబ్లెట్స్, అబార్షన్ కిట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు.

Also Read:Vaibhav Suryavanshi: 50 ఓవర్లు ఆడుతా, నెక్స్ట్‌ టార్గెట్‌ అదే.. వైభవ్‌ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

మెడికల్ షాపులు, ఆర్ఎంపి లు, పి.ఎం.పి. వద్ద నిషేధిత మెడిసిన్స్ ఉన్నట్లు వెలుగుచూశాయి. పలు షాపులు సీజ్ చేశారు అధికారులు. రాజమండ్రికి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని భారీ మొత్తంలో వయాగ్రా, అబార్షన్ కిట్ల స్వాధీనం చేసుకున్నారు. మారుమూల, గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో  విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ నుంచి భారీ మొత్తంలో దిగుమతి చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నారు కొన్ని మెడికల్ షాపుల నిర్వాహకులు.

Exit mobile version