తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో మెడికల్ షాపులు, ఆర్ఎంపి క్లినికులపై తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగుడా రావిరాలలో శ్రీ బాలాజీ క్లినిక్ లో తనిఖీలు చేశారు. గుండ్లపల్లి నరసింహ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. స్టెరైడ్స్ తో పాటు 37రకాల ఇతర మెడిసిన్ సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ గ్రామంలో మహమ్మద్ మసూద్ అనే వ్యక్తి ఆర్ఎంపి క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
Also Read:Nambala Kesava Rao: మావో అగ్ర నేత నంబాల కేశవరావు హతం.. బ్యాగ్రౌండ్ ఇదే!
39 రకాల యాంటీ బయోటిక్స్, స్టెరైడ్స్ ఇతర మెడిసిన్ తో పాటు 17రకాల శాంపిల్స్ సీజ్ చేశారు అధికారులు. మసూద్ క్లినిక్ కి వస్తున్న రోగులకు ఫీషియన్ శాంపిల్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. ఫీషియన్ శాంపిల్స్ మార్కెట్లో అమ్మవద్దని డీసీఏ సూచించింది. 50వేల రూపాయల మెడిసిన్ ని డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. డ్రగ్ లైసెన్స్ లేకుండా మెడిసిన్ అమ్మడం చట్టరీత్యా నేరమని కఠిన చర్యలు తప్పవని డీసీఏ హెచ్చరించింది.
