Site icon NTV Telugu

Drohi Movie: నేషనల్‌ సినిమా డే రోజున ద్రోహి రిలీజ్.. ₹112 కే టికెట్లు!

Drohi Movie

Drohi Movie

Drohi Movie Teaser Released: నేషనల్‌ సినిమా డే సందర్భంగా విడుదలకు సిద్ధమైంది ఒక తెలుగు సినిమా. సందీప్‌ కుమార్‌, దీప్తి వర్మ హీరో హీరోయిన్లుగా విజయ్‌ పెందుర్తి దర్శకత్వంలో ‘ద్రోహి’ ద క్రిమినల్‌ అనే ఉపశీర్షికతో ఒక సినిమా తెరకెక్కింది. గుడ్‌ ఫెలో మీడియా సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌ డే ఎంటర్‌టైనమెంట్‌ పతాకాలపై విజయ్‌ పెందుర్తి, శ్రీకాంతరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.

ఈ క్రమంలోనే ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆ రోజు నేషనల్‌ సినిమా డే సందర్భంగా సినీ యూనిట్ సినీ ప్రియులకు ఓ ప్రత్యేక ఆఫర్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమంటే అక్టోబర్‌ 13న మాత్రం మల్టీపెక్స్‌లో రూ.112లకే సినిమా టికెట్‌ లభించనుందని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక తాజాగా హీరో త్రిగుణ్‌ ఈ సినిమాను టీజర్‌ను విడుదల చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ “దర్శకుడు, హీరోకు కళ అంటే ప్రాణం అని ఈ టీమ్‌ అంతా ప్రేమతో ఈ సినిమా చేశారని అన్నారు. సక్సెస్‌ఫుల్‌ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడి పని తీరు టీజర్‌లో కనిపించింది, ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నానని అన్నారు.

నిజానికి నాగార్జున హీరోగా నటించిన అంతం సినిమాను హిందీలో ద్రోహి పేరుతో రిలీజ్ చేశారు. ఇక అదేవిధంగా కమల్ హాసన్ కూడా ద్రోహి పేరుతో ఒక సినిమా చేశారు. ఇప్పుడు అదే పేరుతో తెరకెక్కిన ద్రోహి సినిమా నేషనల్ సినిమా డే రోజున రిలీజ్ అవుతూ ఉండడం గమనార్హం.

Exit mobile version