Site icon NTV Telugu

Namaz On Bus: నమాజ్ చేయడానికి రోడ్డుపై బస్సు ఆపిన డ్రైవర్.. విచారణకు మంత్రి ఆదేశం

Ksrtc

Ksrtc

కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేయడానికి రోడ్డుపై బస్సును ఆపి, ఆపై సీటుపై ప్రార్థన చేశాడు. బస్సులోన ప్రయాణికులు ఈ తతాంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింటా వైరల్ గా మారింది. ప్రయాణికుల ప్రయాణ ఆలస్యానికి కారణమయ్యాడని, సమయం వృథా అయ్యిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీడియోలో, ఆ వ్యక్తి బస్సు సీటుపై కూర్చుని నమాజ్ చేస్తున్నట్లు చూడవచ్చు.

Also Read:Amaravati: రేపు డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. కనిపిస్తే కఠిన చర్యలకు ఆదేశం

ఈ సమయంలో ట్రాఫిక్ వేగంగా కదులుతుంది. బస్సులో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారు ఇదంతా నిస్సహాయంగా చూస్తున్నారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం జావేరి సమీపంలోని హుబ్లి హవేరి రోడ్డులో జరిగినట్లు చెబుతున్నారు. సమాచారం ప్రకారం, కొంతమంది ప్రయాణీకులు ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశారు, ఆ తర్వాత కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది.

Also Read:Ketika Sharma : తరగని అందాలతో మత్తెక్కిస్తున్న’కేతిక శర్మ’

దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని ఆ శాఖ తెలిపింది. ఈ విషయంపై రాష్ట్ర రవాణా మంత్రి రామలింగారెడ్డి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థకు లేఖ రాశారు. “ప్రజా సేవలో పనిచేసే ఉద్యోగులు కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది” అని ఆయన రాశారు. ‘భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా చర్యలు అవసరం’ “ప్రతి ఒక్కరికీ వారి మతాన్ని అనుసరించే హక్కు ఉన్నప్పటికీ, బస్సులో ప్రయాణికులు ఉన్నప్పుడు కూడా బస్సును మధ్యలో ఆపి నమాజ్ చేయడం అభ్యంతరకరం” అని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. “వైరల్ వీడియోపై వెంటనే దర్యాప్తు చేయాలని, దోషులుగా తేలితే ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.

Exit mobile version