Site icon NTV Telugu

Drishyam3 : దృశ్యం -3.. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌ వీడియో రిలీజ్

Drishyam 3

Drishyam 3

బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో దృశ్యం ముందు వరసలో ఉంటుంది. అజయ్ దేవగన్, శ్రీయ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. దానికి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం2 కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా దృశ్యం 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ‘దృశ్యం 3’ రిలీజ్ డేట్‌ను అధికారికంగా లాక్ చేశారు. ఈ సినిమా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాతో అజయ్ దేవగన్ మరోసారి విజయ్ సాల్గావ్కర్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాడు.

ఇప్పటికే దృశ్యం 3 షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభమైందని చిత్ర యూనిట్ లేటెస్ట్ గా ప్రకటించింది. ఈ సినిమా వివిధ లొకేషన్లలో భారీ షెడ్యూల్‌తో షూటింగ్ జరగనుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్‌తో పాటు టబు, శ్రియ సరన్, రజత్ కపూర్ సహా ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దృశ్యం 1, 2 మాదిరిగానే ఈసారి కూడా కథ, స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండబోతోందని అంచనాలు ఉన్నాయి. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఇప్పటికే రెండు భాగాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్న దృశ్యం ఫ్రాంచైజీ, మూడో భాగంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Exit mobile version