Site icon NTV Telugu

Summer Tips : వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ నీటిని రోజూ తాగాల్సిందే…

Barli Water

Barli Water

వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడి ప్రతాపం తట్టుకోవడం కష్టమే.. ఉదయం పూట కూడా బయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు.. రోజు రోజుకు ఎండలు మండిపోతున్నాయి.. సమ్మర్ లో వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే.. అయితే వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే ఆరోగ్యం పై కాస్త శ్రద్ద తీసుకోవాలి.. నీటిని మాత్రమే తాగితే సరిపోదు.. బార్లీ గింజలు వేడి తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కొందరు మజ్జిగను తాగుతారు.. అలాగే సబ్జా వేసుకొని తాగుతారు.. అయితే బార్లీ ని కూడా తప్పకుండ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. వడదెబ్బ బారిన పడకుండా ఉండొచ్చు. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే బార్లీ నీళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాను కాపాడుతుంది.. అందుకే వేసవిలో ఈ బార్లీ నీళ్లను తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..

వేసవిలో వేడికి చెమటలు పట్టడం సహజం.. అప్పుడు జ్యూస్ లను తాగకుండా బార్లీ నీళ్లను, మజ్జిగను తాగడం మంచిది.. ఇకపోతే కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కూడా బార్లీ నీళ్లను ఎప్పటికప్పుడు తాగుతూ ఉండాలి.. బార్లీలో మెగ్నీషియం, ఫైబర్, క్యాల్షియం వంటి పోషకాలు ఉంటాయి.. బరువు తగ్గాలని అనుకొనేవారు ఈ నీళ్లను తాగడం మర్చిపోకండి.. సులువుగా కొవ్వును కరిగిస్తుంది.. ఈ నీటిని ఎలా తయారు చెయ్యాలంటే.. ముందుగా ఒక గ్లాస్ నీళ్లను తీసుకొని అందులో ఒక స్పూన్ బార్లీ గింజలను వేసి ఒక గంట పాటు నాన్నిచ్చి తాగవచ్చు.. అలాగే రాత్రి నానబెట్టి ఉదయం తాగవచ్చు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.

Exit mobile version