Site icon NTV Telugu

Health Tips: లివర్ ని శుభ్ర పరిచేందుకు ఈ డ్రింక్స్ తాగండి..

New Project (50)

New Project (50)

మానవుల జీర్ణవ్యవస్థలో కాలేయం అతిపెద్దది పాత్ర పోషిస్తుంది. అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది వివిధ పదార్థాల జీవక్రియతో సహా శరీరంలో వివిధ ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. వ్యాధిగ్రస్తులైన లేదా అనారోగ్యకరమైన కాలేయం శరీరంలోని అన్ని జీవ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల, కాలేయం దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శుభ్రపరచడం చాలా ముఖ్యం. కాలేయం శుభ్రపడాలంటే ఇలా చేయండి. బాడీలో పొట్టభాగంలో ఎడమవైపు నొప్పిగా ఉంటే అది లివర్ సమస్య కావొచ్చు. లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే కడుపు నొప్పిగా ఉంటుంది. లివర్ డీటాక్స్ అయ్యేందుకు కొన్ని డ్రింక్స్ హెల్ప్ చేస్తాయి. వీటిని తాగడం వల్ల లివర్ డీటాక్స్ అవుతాయి.

READ MORE: iPhone 16 Pro: త్వరలో iPhone 16 Pro విడుదల.. ఫీచర్స్ ఇవే!

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఓ గ్లాసు వేడినీటిలో నిమ్మరసం కలిపి తాగండి. ఇందులోని విటమిన్ సి లివర్ డీటాక్స్ ఎంజైమ్స్‌ని ప్రేరేపించి పిత్త ఉత్పత్తికి సాయపడుతుంది. పిత్తం కాలేయంలోని కొవ్వుని విచ్ఛిన్నం చేయడానికి హెల్ప్ చేస్తుంది. బీట్‌రూట్‌లో ఎక్కువగా బీటాలైన్స్ ఉన్నాయి. ఇవి కాలేయ పనితీరుకి మద్దతిచ్చే యాంటీ ఆక్సిడెంట్. ఈ పాలని తాగితే లివర్ డీటాక్స్ అవుతుంది. అందుకే, తాజా బీట్‌రూట్ జ్యూస్ తాగితే లివర్ హెల్దీగా ఉంటుంది. పసుపులో కర్కుమిన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. పాలలో పసుపు వేసుకుంటే అవి మంచి డీటాక్సీఫైయర్ డ్రింక్‌లా పనిచేస్తాయి. అందుకోసం పాలలో కొద్దిగా పసుపు, నల్ల మిరియాల పొడి వేయండి. ఈ పాలని తీసుకుంటే అవి లివర్ హెల్త్‌ని కాపాడుతుంది.

గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి ఓ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది లివర్ దెబ్బతినకుండా, డీటాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందుకోసం రోజూ ఒకటి, రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే లివర్ హెల్త్‌కి మంచిది. డాండెలైన్ రూట్ టీని వేడినీటిలో మరిగించి రెగ్యులర్‌గా తీసుకుంటే మీరు లివర్‌ని కాపాడుకోవచ్చు. ఈ టీలో కూడా లివర్ డిటాక్సీఫైయింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి పిత్త ఉత్పత్తిని ప్రేరేపించి లివర్ పనితీరుకి సాయపడుతుంది.

Exit mobile version