Site icon NTV Telugu

DRI: పాకిస్థాన్‌కి చెందిన 39 కంటైనర్లు స్వాధీనం.. పాక్, యూఏఈ పౌరుల కుట్ర..!

Pak

Pak

ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్ కింద డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) రూ. 9 కోట్ల విలువైన పాకిస్థాన్ మూలానికి చెందిన వస్తువులను స్వాధీనం చేసుకుంది. రూ. 9 కోట్ల విలువైన 1,115 మెట్రిక్ టన్నుల వస్తువులతో నిండిన 39 కంటైనర్లను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. జూన్ 26న, దిగుమతిదారు కంపెనీ భాగస్వామిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

READ MORE: TG SSC Supplementary Result 2025: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. భారత ప్రభుత్వం పాకిస్థాన్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులను నిషేధించింది. మే 2, 2025 పాకిస్థాన్ మూలానికి చెందిన ఏదైనా వస్తువుల దిగుమతి లేదా రవాణాపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. ఈ నిషేధం తర్వాత కూడా.. పాక్ నుంచి యూఏఈ ద్వారా భారత్‌కు వస్తువులు దిగుమతి అవుతున్నాయి. గతంలో కూడా గుర్తించిన డీఆర్ఐ ఆయా వస్తువులపై 200% కస్టమ్స్ సుంకం విధించబడింది. అయినప్పటికీ.. కొంతమంది దిగుమతిదారులు పాకిస్థాన్‌కి చెందిన వస్తువులను దాచిపెట్టి, షిప్పింగ్ పత్రాలను తారుమారు చేసి దిగుమతి చేసేందుకు యత్నిస్తున్నారు.

READ MORE: Kolkata law student case: కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. పెళ్లి తిరస్కరించినందుకు లా విద్యార్థినిపై గ్యాంగ్ రేప్..

తాజాగా పట్టుకున్న కంటైనర్లను యూఏఈ నుంచి వస్తున్నట్లు నమ్మించి దిగుమతి చేసుకుంటున్నారు. పాకిస్థాన్‌లోని కరాచీ ఓడరేవు నుంచి దుబాయ్‌లోని జెబెల్ అలీ ఓడరేవు ద్వారా భారతదేశానికి ఈ వస్తువులు తీసుకువచ్చినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఈ కంటైనర్లను నవీ ముంబైలోని నవా షెవా ఓడరేవులోనే స్వాధీనం చేసుకున్నారు. ఈ దిగుమతుల వెనుక పాక్, యూఏఈ పౌరుల కుట్ర ఉందని సమాచారం వెలువడింది. డీఆర్ఐ నిఘా యంత్రాంగాన్ని మరింత ముమ్మరం చేసింది.

Exit mobile version