NTV Telugu Site icon

DRDO Recruitment : డీఆర్డీఓలో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తులకు కొద్ది రోజులు మాత్రమే గడువు..

Drdo

Drdo

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరుస గుడ్ న్యూస్ లను చెబుతూ ప్రజల అభివృద్ధికి ముందు ఉంటుంది తాజాగా నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ప్రముఖ సంస్థ డీఆర్డీఓలో ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు జూలై 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది. అభ్యర్థులు ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 36 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్‌సీవీటీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి..

ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు..

ఖాళీలు..

మెకానిక్ మోటార్ వెహికల్ (MMV) -1 పోస్ట్

డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) – 4 పోస్టులు

ఎలక్ట్రానిక్స్ మెకానిక్ – 3 పోస్టులు

ఎక్విప్‌మెంట్ మెకానిక్ – 4 పోస్టులు

లేబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) – 6 పోస్టులు

కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) -18 పోస్టులు

ఇక ఈ ఉద్యోగాలకు సంబందించి వయస్సు 18 ఏళ్ల నుంచి 37 ఏళ్ల వరకు ఉండాలి..

మన డిగ్రీ మార్కులను బట్టి సెలెక్ట్ చేస్తారు..షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ / ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ సమయంలో.. ధృవీకరణ కోసం అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్ల కాపీలను సమర్పించాల్సి ఉంటుంది… ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7 వేలు స్టైఫండ్‌ లభిస్తుంది..

ఎలా అప్లై చేసుకోవాలంటే?

*. ముందుగా అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ rac.gov.in కి వెళ్లండి.

*. దీని తర్వాత అభ్యర్థులు హోమ్ పేజీలో సంబంధిత రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోండి.

*. ఇప్పుడు అభ్యర్థి ఆధారాలను నమోదు చేయడం ద్వారా లాగిన్ చేయవచ్చు. తర్వాత అవసరమైన పత్రాలను స్కాన్ చేసి.. సమాచారాన్ని పూరించండి.

*.తర్వాత అభ్యర్థి దరఖాస్తు ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.

*. ఇంటర్వ్యూ సమయంలో.. అభ్యర్థి సంతకం చేసిన ప్రింటవుట్‌ను తీసుకెళ్లాలి..

ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వాళ్ళు అభ్యర్థులు అధికారిక సైట్ https://rac.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు..