Site icon NTV Telugu

DRDO Recruitment: బీటెక్ స్టూడెంట్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. పూర్తి వివరాలు..

Drdo

Drdo

ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన వాళ్ళు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించి rac.gov.inఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ నోటిఫికేషన్ లో మొత్తం పోస్టులు 55 ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 11గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..జనరల్, OBC మరియు EWS పురుష అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.100. SC/ST/PWD మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు..

ఇందులో సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్, సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అభ్యర్థి వయస్సు 55 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘ఈ’కి గరిష్ట వయస్సు 50 ఏళ్లు మించకూడదు. అదే విధంగా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘డి’కి గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘సి’కి గరిష్ట వయోపరిమితి 40 సంవత్సరాలు. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ‘B’కి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు…

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ముందుగా అధికార వెబ్ సైట్ rac.gov.in లో సందరర్శించండి.. ఆ తర్వాత హోమ్‌పేజీలో అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 146 కింద వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి..దరఖాస్తు ఫారమ్ నింపండి. ఆ తర్వాత అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు ఫారమ్‌ను సమర్పించి.. భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి..త్వరలోనే ఎగ్జామ్ నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నారు..

Exit mobile version