Site icon NTV Telugu

Draupadi Murmu : దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తా

Draupadi Murmu Oath

Draupadi Murmu Oath

Draupadi Murmu Oath Taking Ceremony Live Updates.

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో నేడు భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ముర్ముతో సీజేఐ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. అనంతరం ఆమె జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముర్ము. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని ఆమె అన్నారు. అంతేకాకుండా.. 50 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల వేళ నా రాజకీయ జీవితం మొదలైందని ఆమె అన్నారు. 75 ఏళ్ల ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

 

దేశంలో మరింత వేగంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని ముర్ము వ్యాఖ్యానించారు. అందరి సహకారంతో ఉజ్వల యాత్ర కొనసాగించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్గిల్‌ దివాస్‌ భారత్‌ శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్పదన్న ద్రౌపది ముర్ము.. వార్డు కౌన్సిలర్‌ నుంచి రాష్ట్రపతి స్థాయికి వచ్చానన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి చిత్తశుద్ధితో పనిచేస్తాని ఆమె తెలిపారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని, వచ్చే 25 ఏళ్లలో దేశంలో పురగతి సాధించాలన్నారు.

 

Exit mobile version