తెలంగాణలో సంచలనం కలిగించిన ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ వైశాలిని నవీన్ రెడ్డి ఎందుకు కిడ్నాప్ చేశాడు? కిడ్నాప్ చేయాల్సిన కారణం ఎందుకొచ్చింది? కిడ్నాప్ చేసిన తర్వాత వైశాలిని ఏం చేద్దాం అనుకున్నాడు?. కిడ్నాప్ చేసిన తర్వాత ఎక్కడికి పారిపోదాం అనుకున్నారు?.వైశాలిని కిడ్నాప్ చేసి మళ్లీ ఎందుకు వదిలి పెట్టాడు? వైశాలి కిడ్నాప్ వ్యవహారం పైన రాచకొండ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ రెడ్డిని మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో నవీన్ రెడ్డిని నిన్న పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. నిన్న రాత్రి సీన్ రీ కన్స్ట్రక్షన్ కూడా చేశారు. Mr. టీ పాయింట్ దగ్గర నుంచి వైశాలి ఇంటి వరకు జరిగిన సంఘటన సంబంధించి పూర్తిస్థాయిలో సీన్ టు సీన్ రీ కనస్ట్రక్షన్ చేశారు.
వైశాలిని కిడ్నాప్ చేసి పెళ్లికి ఒప్పించాలని ప్లాన్ చేసినట్లుగా పోలీసులకు నవీన్ రెడ్డి తెలిపారు. తమమధ్య కొంతకాలంగా సంబంధాలు ఉన్న విషయాన్ని పోలీసుల ముందు నవీన్ రెడ్డి కన్ఫామ్ చేశాడు .వైశాలి కుటుంబంతో కూడా తమకు సంబంధాలు ఉన్నాయని నవీన్ రెడ్డి పోలీసులకు చెప్పాడు. వైశాలి కుటుంబం కొంత ఆర్థిక సాయం కూడా చేశానని పోలీసులు ఎదుట నవీన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. మిస్టర్ టి పాయింట్లు కిడ్నాప్ సంబంధించి ప్లాన్ చేసి అక్కడినుంచి వైశాలిని ఎత్తుకొచ్చేందుకు తమ సిబ్బందితో కలిసి వెళ్ళామని తెలిపారు.
Read Also: Covid 19 New Variant Dangerous Live: కొత్త వేరియంట్ అంత డేంజరా?
ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం నవీన్ రెడ్డిని పోలీసులు చంచల్ గూడ నుండి ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా 3 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి నవీన్ ను పోలీసులు విచారించనున్నారు. శనివారం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు విచారించనున్నారు. ఈ విచారణలో భాగంగా ప్రధానంగా కీలక విషయాలను రాబట్టడంతో పాటు కిడ్నాప్ సీన్ ను రీకన్ స్ట్రక్షన్ చేయనున్నారు. కాగా ఇప్పటికే కోర్టు నిందితుడు నవీన్ రెడ్డిని 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు నవీన్ ను అదుపులోకి తీసుకున్నారు.
గతేడాది బొంగుళూరులోని స్పోర్ట్స్ అకాడమీలో వైశాలితో నవీన్ రెడ్డికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వైశాలి ఫోన్ నెంబర్ తీసుకున్న నవీన్ తరచూ కాల్స్, మెసేజ్ లు చేసేవాడు. కాస్త పరిచయం పెరగడంతో ఆమెతో కలిసి నవీన్ ఫోటోలు తీసుకున్నాడు. ఈ క్రమంలో వైశాలిని పెళ్లి చేసుకోవాలనే ఆశ నవీన్ లో పుట్టుకొచ్చింది. దీనితో వైశాలి ముందు నవీన్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. అయితే వైశాలి తన తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని నవీన్ కు చెప్పింది. ఈ క్రమంలోనే వైశాలిని పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులకు నవీన్ చెప్పుకొచ్చాడు. కానీ వైశాలి తల్లిందండ్రులు మాత్రం నవీన్ తో పెళ్ళికి ససేమిరా అన్నారు.
ఇది మనసులో పెట్టుకున్న నవీన్ వైశాలి తల్లి దండ్రులపై కక్ష పెంచుకున్నాడు. వైశాలి పేరుతో నకిలీ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను క్రియేట్ చేశాడు. ఆ ఖాతాలో గతంలో వైశాలితో దిగిన ఫోటోలను నవీన్ వైరల్ చేశాడు. అలాగే వైశాలి ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకున్న నవీన్ గణేష్ నిమజ్జనం సందర్బంగా వైశాలి ఇంటి ముందు స్నేహితులతో కలిసి నానా హంగామా చేశాడు. దీనిపై యువతి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.డిసెంబర్ 9న వైశాలికి మరో యువకుడితో నిశ్చితార్ధం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న నవీన్ పక్కా ప్లాన్ వేశాడు. యువతిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతని స్నేహితులు, టీ షాప్ లో పని చేసే యువకుల సాయంతో యువతి ఇంటికి చేరుకున్నాడు నవీన్. ఇంటి ముందు కార్లను ధ్వంసం చేసి వైశాలి కుటుంబసభ్యులను కొట్టి వైశాలిని ఇంట్లో ఉన్న సీసీ కెమెరా, డివిఆర్ లను కారులో ఎత్తుకెళ్లాడు. కారులో నల్గొండ వైపు వెళ్తున్న నవీన్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి నల్గొండ వద్ద నవీన్ రెడ్డి, అతని స్నేహితులు కారు దిగి వెళ్లిపోయారు.
Read Also: Maa Bava Manobhavalu: బాలయ్య పాటకి ఇరగదీసే స్టెప్పులు వేసిన చరణ్, బన్నీ
ఇక నవీన్ మరో స్నేహితుడు వైశాలిని వోల్వో కారులో హైదరాబాద్ కు తీసుకెళ్లాడు. డిసెంబర్ 9నే వైశాలి తన తల్లిదండ్రులకు క్షేమంగానే ఉన్నానని ఫోన్ చేసింది. ఇక ఈ కేసులో ఇప్పటివరకు 38 మందిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే నవీన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు… మరోవైపు ఇవాళ రాత్రి వైశాలిని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకువెళ్లారు తిరిగి ఎక్కడికి వదిలిపెట్టారు అనే దానిమీద సీన్ పోలీసులు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైశాలి కిడ్నాప్ కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలతో పోలీసులు ముందుకు వెళ్తున్నారు.
